ఇప్పటి వరకూ క్లాస్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలే చేస్తూ వచ్చిన వరుణ్ తేజ్ మొదటి సారి ఫుల్ మాస్ అవతారంలో అలరించడానికి రెడీ అయ్యాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘వాల్మీకి’ రేపు(సెప్టెంబర్ 20న) విడుదల కాబోతుంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి రీమేక్. వరుణ్ తేజ్ కు జంటగా పూజ హెగ్దే నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఇక ఈ చిత్రం రన్ టైం 168 నిమిషాలు.
ఇక ఈ చిత్రానికి సెన్సార్ వారు పాజిటివ్ టాక్ చెప్పడం విశేషం. ‘గణేష్ అనే ఒక సాధారణ వ్యక్తి, పరిస్థితుల ప్రభావం వల్ల గద్దలకొండ గణేష్ అనే ఓ పక్కా గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమాలోని మూల కథాంశమని తెలుస్తుంది. గతంలో గణేష్ కి ఓ లవ్ స్టోరీ ఉంటుంది.. అలానే మరో హీరో అధర్వ మురళి తాను తీయాలనుకుంటున్న సినిమా కోసం ఓ గ్యాంగ్ స్టర్ ని వెతికే పనిలో పడతాడు. ఈ క్రమంలో అథర్వ మురళికి గణేష్(వరుణ్ తేజ్) దొరుకుతాడు. ఇక వీరి ప్రయాణం చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. ఇక వరుణ్ గద్దలకొండ గణేష్ పాత్రలో ఇరగదీశాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలకి కూడా సెన్సార్ వారు కత్తెర వేశారు. అవేంటో ఒకసారి చూద్దాం :
1) టైటిల్ కార్డు లో ‘గన్’ షాట్స్ ను సీజితో కవర్ చేశారట.
2) భోగం మేళం అనే పదాల్ని కూడా మ్యూట్ చేశారట
3) గు***** అనే పదాన్ని కూడా మ్యూట్ చేశారు
4) బాస్ట***** అనే పదాన్ని రాస్కల్ గా మార్చరట
5) మెంటల్ అనే పదాన్ని కూడా మ్యూట్ చేశారట
6) ట్రైలర్ లో వినిపించిన మాదా*** ద్ పదాన్ని మ్యూట్ చేశారు
7) ‘డం** బ్ అనే పదాన్ని ఫూల్ గా మార్చరట