Vamsi, Vijay: విజయ్-వంశీ పైడిపల్లి కాంబో మరోసారి!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా తెలుగు ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు కానీ తమిళ ఆడియన్స్ కి మాత్రం బాగానే నచ్చింది. అక్కడ ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ స్వయంగా ప్రకటించింది కాబట్టి సంక్రాంతి విన్నర్ గా ‘వరిసు’ సినిమానే నిలిచింది. అలా అని ఈ సినిమాపై విమర్శలు రాలేదని కాదు. చాలా మంది ఈ సినిమా రొటీన్ గా ఉందని అన్నారు.

కానీ విజయ్ ఇమేజ్ వర్కవుట్ అవ్వడంతో సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లికి మరో సినిమా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు విజయ్. తన 69వ సినిమా కోసం వంశీని స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారట విజయ్. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ.. ‘వరిసు’ సినిమాలో ఎమోషన్స్, కమర్షియల్స్ ఎలిమెంట్స్ ని హ్యాండిల్ చేసిన విధానం నచ్చడంతో విజయ్ మరో ఛాన్స్ ఇచ్చినట్లు చెన్నై మీడియా కథనాలు ప్రచురిస్తోంది.

ఇప్పుడు వంశీ పైడిపల్లి.. విజయ్ కి కథ సిద్ధం చేసే పనిలో పడ్డారట. నిజానికి ‘వారసుడు’ తరువాత ఓ తెలుగు హీరోతో సినిమా చేయాలనుకున్నారు వంశీ. కానీ ఇప్పుడు తెలుగు హీరోలెవరూ కూడా ఖాళీగా లేరు. ఒక్కొక్కరి చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీళ్ల కోసం ఎదురుచూసే కంటే విజయ్ కోసం స్క్రిప్ట్ రాసుకోవడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు వంశీ పైడిపల్లి. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చాకే క్లారిటీ వస్తుంది.

విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి కొత్తగా ట్రై చేయమని వంశీకి సలహాలు ఇస్తున్నారు. ‘వరిసు’ సినిమా రెగ్యులర్ కాన్సెప్ట్ అనే ఫీలింగ్ జనాల్లో ఉంది. అందుకే ఈసారి విజయ్ కోసం డిఫరెంట్ స్టోరీ రాయమని అడుగుతున్నారు. ప్రస్తుతం విజయ్.. లోకేష్ దర్శకత్వంలో ‘లియో’ అనే సినిమా చేస్తున్నారు. ఆ తరువాత అట్లీతో సినిమా చేయనున్నారు. ఆలోగా.. వంశీ తన స్క్రిప్ట్ తో విజయ్ ని మెప్పిస్తే ఓకే లేదంటే ఆప్షన్ మారిపోయే ఛాన్స్ ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus