మూడోసారి కూడా పెళ్లి విషయంలో తప్పు చేశా!

దక్షిణాది నటి వనితా విజయ్‌కుమార్‌ లాక్ డౌన్ లో మూడో పెళ్లి చేసుకొని షాకిచ్చింది. జూన్ నెలలో సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పీటర్ తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి అని, అతడితో భవిష్యత్ బాగుంటుందన్న ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపింది. అయితే పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడంటూ అతడి మొదటి భార్య ఎలిజిబెత్ కేసు పెట్టడంతో వివాదం మొదలైంది. ఈ విషయంలో కోర్టుకి వెళ్తానని చెప్పింది వనితా.

ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా ఈమె తన మూడో భర్త పీటర్ ని కూడా వదిలేసిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ కూడా ఈ విషయం నిజమేనంటూ తన ఫేస్ బుక్ లో రాసుకొచ్చాడు. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది వనితా విజయ్ కుమార్. తన మూడో భర్త పీటర్ పాల్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు వెల్లడించింది. అంతేకాదు.. తన మూడో భర్త మొదటి భార్య నుండి క్షమాపణలు కోరుతోంది వనిత.

ఆమెకి అన్యాయం చేశానని.. తను చేసిన తప్పుని క్షమించాలని కోరింది. తన కొడుకు ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పినా.. వినకుండా మూడోసారి పెళ్లి విషయంలో తప్పు చేశానని చెబుతోంది. పెళ్లైన కొన్నాళ్లకే పీటర్ కి హార్ట్ ఎటాక్ వచ్చింది. బాగా తాగడం వలనే ఈ సమస్య వచ్చిందని డాక్టర్లు చెప్పారట. ఈ విషయంలో ఇకపై తాగనని వనితాకి చెప్పాడట పీటర్. అయినప్పటికీ ఆమెకి తెలియకుండా తాగడం స్టార్ట్ చేశాడట. ఇటీవల వీరంతా గోవాకి వెళ్లారు. గోవా ట్రిప్ లో రోజంతా పీటర్ తాగుతూనే ఉన్నాడట. దాంతో వనిత అతనితో గొడవపడి దూరం పెట్టినట్లు.. వీడియోలో చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


Most Recommended Video
Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus