ఆటో బయోగ్రఫీలో అఫైర్‌.. 15ఏళ్ల తర్వాత స్పందించిన స్టార్‌ నటుడి మాజీ భార్య!

ఓంపురి (Om Puri) .. సగటు క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు చాలా దూరం. ఆయన నటన, ఎంచుకున్న పాత్రలు.. ఇలా అన్నీ డిఫరెంట్‌గానే ఉండేవి. విలనీ చేసినా, సహాయ పాత్ర చేసినా తనదైన మార్కు వేసేవారాయన. అయితే ఆయన జీవితంలో ఓ అంశం మాత్రం ఆయనను ఇబ్బందికి గురి చేసింది. అదే పనిమినిషితో అఫైర్‌. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం బయటకు వచ్చిన ఆ విషయం గురించి ఆయన మాజీ భార్య నందిత ఇప్పుడు మాట్లాడారు. దీంతో ఆ వివరాలు, ఆమె వివరణ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Star Actor

బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసినా.. మిగిలిన ఇండస్ట్రీలోనూ తన నటనను రుచి చూపించిన ఓంపురి బయోగ్రఫీ ‘అన్‌లైక్లీ హీరో: ఓంపురి’ (Star Actor) 15 ఏళ్ల క్రితం విడుదలైంది. ఆ సమయంలో ఓ వార్త తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన పనిమనిషితో అఫైర్‌ నడిపినట్లు ఆ పుస్తకంలో రచయిత, మాజీ భార్య అయిన నందిత పేర్కొన్నారు. ఈ విషయం వివాదానికి దారి తీయడం ఒక వంతు అయితే.. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం మరో ఎత్తు.

ఈ విషయం గురించి నందిత దగ్గర తాజాగా ప్రస్తావిస్తే.. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ల గురించి ఓంపురి తన బయోగ్రఫీలో వెల్లడించారు. వ్యక్తిగత విషయాల గురించి కూడా కొంత తెలియజేశారు. పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన పనిమనిషితో అఫైర్‌ గురించి చెప్పగానే ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది? అని తాను అడిగానని, కానీ ఆయన చెప్పారని.. అదే రాశానని నందిత చెప్పారు. అఫైర్‌ విషయంలో తప్పేముంది.. అప్పటికి నేను పెళ్లి చేసుకోలేదు. అలాగే అప్పుడు రిలేషన్‌షిప్‌లో కూడా లేను.

అదొక చిన్న అఫైర్. ఆ నిజాలు తెలిస్తే తప్పేం కాదు అని అప్పుడు ఓంపురి చెప్పారు. ఆయన మాటల ప్రకారమే పుస్తకంలో రాశానని నందిత అన్నారు. అయితే పుస్తకం విడుదలయ్యాక అందరూ ఆయన లైఫ్‌లో హర్డల్స్‌ గురించి కాకుండా.. అఫైర్‌ గురించే మాట్లాడారు. అది తనను కలచి వేసింది నందిత చెప్పారు. అయితే ఈ వివాదం గురించి గతంలో దివంగత ఓంపురి మాట్లాడుతూ అందరిలాగే తానూ తన భార్యకు అన్ని విషయాలు చెప్పానని, తన పుస్తకం అమ్ముకోవడం కోసం ఆమె ఆ విషయాలను రాస్తుందని అనుకోలేదని చెప్పారు.

షాకిస్తున్న ‘తండేల్’ సాంగ్ బడ్జెట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus