Vanitha Vijaykumar: 20 ఏళ్ళ తరువాత తెలుగులో వనితా విజయ్ కుమార్

దేవి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి వనితా విజయ్ కుమార్. తండ్రి విజయ్ కుమార్ సపోర్ట్ తో మొదట సినిమా ఇండస్ట్రీలో బాగానే నడుచుకున్న వనితా ఆ తరువాత మ్యారేజ్ వివాదాలతో అనేక రకాల విమర్శలు ఎదుర్కొంది. ఆ మధ్య తమిళ బిగ్ బాస్ కు కంటెస్టెంట్ గా వెళ్లి ఆమె చేసిన రచ్చా అంతా ఇంతా కాదు. నటిగా కూడా ఇండస్ట్రీలో విమర్శలు ఎదుర్కొంది. సహా నటులు సైతం ఆమె పై కంప్లైంట్ చేయడం కోలీవుడ్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇక మూడు పెళ్లిళ్ల అనంతరం కూడా విడాకులు తీసుకొని ట్రోలింగ్స్ ఎదుర్కొంది. జీవితంలో ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నా కూడా వనితా తన సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక చాలా రోజుకు తరువాత ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 1999లో వచ్చిన దేవి సినిమా అనంతరం ఆమె మళ్ళీ తెలుగు వైవు చూడలేదు. ఇక 20 ఏళ్ళ అనంతరం తెలుగు వాళ్ళను పలకరిస్తూ ఒక యూ ట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది.

ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు బ్యూటీ టిప్స్ కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తానని అందుకు తెలుగు వారి సపోర్ట్ కావాలని కోరింది. మరి ఆమె ఛానెల్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.


థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus