మూడో పెళ్లికి రెడీ అవుతున్న ‘దేవి’ హీరోయిన్… షాక్ అవుతున్న నెటిజెన్లు..!

ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ అలాగే ఒకప్పటి క్రేజీ హీరోయిన్ మంజుల.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. వీళ్ళకు నలుగురు కుమార్తెలు… ఒక్క కొడుకు. నలుగురు కూతుర్లలో ముగ్గురు మన తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఈయన రెండో కుమార్తె వనితా విజయ్ కుమార్ ‘దేవి’ చిత్రంలో నటించింది.మూడో కుమార్తె ప్రీతి విజయ్ కుమార్ .. ‘రుక్మిణి’ ‘మా అన్నయ్య’ వంటి చిత్రాల్లో నటించింది. ఇక నాలుగవ అమ్మాయి శ్రీదేవి విజయ్ కుమార్.. మన ప్రభాస్ మొదటి చిత్రం ‘ఈశ్వర్’ లో హీరోయిన్ గా నటించింది.

ఇదిలా ఉండగా రెండో కుమార్తె వనితా విజయ్ కుమార్ నిత్యం ఏదో ఒక వివాదాంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. గతేడాది ‘బిగ్ బాస్3’ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.అక్కడ కూడా అదే రచ్చ.ఇదిలా ఉండగా.. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు 3వ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వడం వైరల్ గా మారింది. జూన్ 27న చెన్నైలో ఈమె మూడవ పెళ్ళని తెలుస్తుంది.పలు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పని చేసిన పీటర్ పాల్ అనే వ్యక్తిని.. వనితా పెళ్లి చేసుకోబోతోందట.

వనితా విజయకుమార్ అఫీషియల్ గా వెడ్డింగ్ కార్డ్ ని కూడా మీడియాకు ముందుకు తీసుకు రావడం గమనార్హం. 2000వ సంవత్సరంలో నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకుంది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2005లో విడాకులు తీసుకున్నారు. తరువాత ఆనంద్ జయ రాజన్ అనే బిజినెస్ మెన్ ను 2007లో రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరికి కూడా ఓ కూతురు ఉంది. ఇప్పుడు వనిత వయసు 40 ఏళ్ళు.. అయినప్పటికీ 3వ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుండడం గమనార్హం.

1

2

Most Recommended Video

ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus