సినీ కుటుంబంలో జన్మించినప్పటికీ.. జీవితంలో అన్ని హాయిగా ఉండవని మరోసారి గుర్తు చేసింది నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) . ఇటీవల ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న ఓ తమిళ రియాలిటీ షోలో అసలు నిజాన్ని వెల్లడిస్తూ, ఎమోషనల్ అయ్యింది. ఓ మహిళా కంటెస్టెంట్ తన చిన్ననాటి చేదు అనుభవాలను, ఎదురైన Laiగిక వేధింపులను షేర్ చేస్తుండగా.. అందులో తనకూ అలాంటి బాధే ఎదురైందని వరలక్ష్మి ఆవేదనతో గుర్తు చేసింది. “నీదీ, నాదీ దాదాపు ఒకే కథ. నేను కూడా చిన్నప్పుడు అలాంటి దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నాను.
ఐదుగురు వ్యక్తులు నా మీద Laiగిక వేధింపులకు పాల్పడ్డారు. నాకు అప్పుడు ఏమీ చేయాలో తెలియదు. కానీ ఆ సంఘటన నా జీవితంలో చెరగని మచ్చలా మారిపోయింది. ఇప్పటికీ ఆ విషాద క్షణాలు గుర్తొస్తే గుండె వణుకుతుంది” అంటూ కంటతడి పెట్టింది వరలక్ష్మి. ఈ మాటలు విన్న షోలోని సభ్యులు, ప్రేక్షకులు ఎవ్వరూ కూడా కంటతడిని ఆపలేకపోయారు.
తనలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారికి బలమైన మద్దతు ఇవ్వాలన్న సంకల్పం ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. వరలక్ష్మి మాట్లాడుతూ..”ఇప్పుడు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పే వయసు కాదు, వాటిపై అవగాహన కలిగించడం ఓ బాధ్యత. నేను ఎప్పుడు నా వాయిస్ వినిపించాల్సి వచ్చినా వెనుకాడను,” అని చెప్పింది.
ఇటీవల వరలక్ష్మి నటన పరంగా కూడా మంచి జోరు చూపిస్తోంది. హనుమాన్, మాక్స్ వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఆకట్టుకున్న ఆమెకు, మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టుల్లో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా ఆమె సై అన్నట్లు సమాచారం. తన చిన్ననాటి బాధను బహిర్గతం చేస్తూ, సమాజానికి అవగాహన కలిగించే ప్రయత్నం చేసిన వరలక్ష్మి ఈ తరం యాక్ట్రెస్‌లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.