Varalaxmi Sarathkuma: ‘యశోద’ చిత్రం గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • October 30, 2022 / 03:43 PM IST

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘యశోద’.’శ్రీదేవి మూవీస్’ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించింది. ప్రమోషన్లలో భాగంగా వరలక్ష్మీ పాల్గొని ‘యశోద’ గురించి సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు మీకోసం :

‘యశోద’ కథ విన్నప్పుడు.. మీ పాత్ర గురించి తెలిసినప్పుడు ఎలా అనిపించింది?

మొదట ఇలాంటి కథ.. క్యారెక్టర్లు ఎలా రాశారు? అని ఆశ్చర్యపోతూ అడిగాను. మీరు ట్రైలర్ చూస్తే… నా క్యారెక్టర్ చాలా కామ్ గా ఉంటుంది. కథ ముందుకు సాగుతున్నప్పుడు నా పాత్ర గురించి మరింతగా రివీల్ అవుతుంది. గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్… మా కథలు ఆసక్తిగా అనిపిస్తాయి.

ఇది ఛాలెంజింగ్ స్క్రిప్ట్ అనే భావన కలిగిందా మీకు?

పెద్ద ఛాలెంజెస్ ఏమీ లేవు. సమంతలా నేను ఫైట్స్ ఏమీ చేయలేదు. నటిగా మంచి క్యారెక్టర్ చేశాను. ఒక డిఫరెంట్ రోల్ చేసేటప్పుడు నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటా. ఆ విధంగా ఛాలెంజింగ్ అనిపించింది తప్ప ఇంకేమి లేదు.

‘యశోద’ లో నటించడానికి మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏంటి?

సమంత పాత్రతో పాటు నా పాత్ర కూడా ప్యారలల్ గా ఉంటుంది. సినిమాలో లీడ్ రోల్ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయి? అనేది సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నాది సెకండ్ లీడ్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఇంత కంటే ఎక్కువ చెబితే స్టోరీ రివీల్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడులు చూపించారు.

మీది డాక్టర్ పాత్రనా?

డాక్టర్ కాదు అండి. ట్రైలర్ లో చూపించిన సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్. ఆమె చాలా రిచ్. డబ్బులు అంటే ఇష్టం. నిజ జీవితంలో నా డ్రెస్సింగ్ స్టైల్, ఇతర అంశాలకు పూర్తి విరుద్ధంగా ఆ పాత్ర ఉంటుంది. తనను తాను బాగా ప్రేమించే పాత్ర అనమాట.

ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. వాళ్ళతో పని చేయడం ఎలా అనిపించింది!

దర్శకులు ఇద్దరూ చాలా కామ్. నేను పని చేసిన దర్శకుల్లో అంత కామ్ గా ఎవరినీ చూడలేదు. వాళ్ళిద్దరూ అరవడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళకు ఏం కావాలో బాగా తెలుసు. ఒక్కో క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. మహిళల పాత్రలను చాలా మంది రిలేట్ చేసుకుంటారు. ఆ విధంగా క్యారెక్టర్లు డిజైన్ చేశారు.

ట్రైలర్ చూస్తుంటే టెక్నికల్ గా కూడా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి అనిపిస్తుంది నిజమేనా?

సినిమాటోగ్రాఫర్ సుకుమార్ గారు అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాలో సంగీతానిది కీలక పాత్ర. మణిశర్మ గారు మంచి సంగీతం అందించారు. మీరు పెట్టే టికెట్ రేటుకు వేల్యూ ఉంటుంది. సినిమాలో అంత మంచి కంటెంట్ ఉంది. క్వాలిటీ విజువల్స్ ఉంటాయి. మా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు ఎంతో ఖర్చుపెట్టి సెట్స్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కూడా బాగుంటుంది.

ఇండియాలో సరోగసి గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. కథ ఏ విధంగా ఉండబోతుంది?

సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది

‘యశోద’లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి?

నా క్యారెక్టర్‌లో డెప్త్ నాకు బాగా నచ్చింది. ‘యశోద’ క్యారెక్టర్ కూడా వెరీ స్ట్రాంగ్ రోల్. సమంత చాలా కష్టపడ్డారు. క్యారెక్టర్స్ కంటే కథ నా ఫేవరెట్. నాకు, రావు రమేశ్ గారికి మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. అలాగే… ఉన్ని ముకుందన్, నాకు మధ్య సీన్స్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. ‘యశోద’ లో కథే హీరో. మేమంతా ఆ కథలో పాత్రధారులు మాత్రమే.

సమంతతో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేశారు.. ఎలా అనిపించింది?

నాకు సమంత 10,12 ఏళ్ల క్రితమే తెలుసు. చెన్నైలో మాకు పరిచయం ఏర్పడింది. సినిమాలో తనకు సీరియస్ సీన్స్ ఉన్నాయి. నేను ఏమో షూటింగ్ గ్యాప్ వస్తే జోక్స్ వేసేదాన్ని. తను నవ్వేది. ‘షాట్ ముందే ఎందుకు ఇటువంటి జోక్స్ వేస్తావ్?’ అనేది. తనతో నటించడం సరదాగా ఉంటుంది. తను స్ట్రాంగ్ విమెన్. పాత్రలో జీవించింది. పవర్ ఫుల్ రోల్ బాగా చేసింది.

టాలీవుడ్లో మీకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక్కడ మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకుల గురించి ఏం చెబుతారు?

‘క్రాక్’లో జయమ్మ తర్వాత నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. రచయితలు నా కోసం స్పెషల్ గా క్యారెక్టర్లు డిజైన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. వేరే భాషలో చేసే ఖాళీ లేదు. తమిళ సినిమాలు చేయడానికి డేట్స్ కుదరడం లేదు. నాకు స్టీరియో టైప్ రోల్స్ రావడం లేదు. అది హ్యాపీగా అనిపిస్తుంది.

మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?

‘శబరి’ అనే మూవీ చేస్తున్నా. అందులో నాది లీడ్ రోల్.’హనుమాన్’ అలాగే బాలకృష్ణ గారి ‘వీర సింహా రెడ్డి’లో చేస్తున్నాను. అందులో నాది క్రేజీ క్యారెక్టర్. మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus