Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!
- February 3, 2026 / 07:49 PM ISTByFilmy Focus Writer
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ చుట్టూ ఇప్పుడు అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్ ఇంకా ప్రోసెస్‌లో ఉండగానే ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ఏరియా కోసమే డిస్ట్రిబ్యూటర్లు కళ్లు చెదిరే రేటును ఆఫర్ చేస్తున్నారట.
Varanasi
ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఒక బడా డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ. 18 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఫిలిం నగర్ టాక్. గతంలో ‘బాహబలి 2’ అక్కడ రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ‘వారణాసి’ రిలీజ్‌కు ముందే అదే రేంజ్ ఆఫర్‌ను దక్కించుకోవడం అంటే జక్కన్న బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పుడే బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే మూడ్‌లో లేరని తెలుస్తోంది.
రాజమౌళి ప్లాన్ ఎప్పుడూ చాలా స్పెషల్‌గా ఉంటుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల సమయంలోనూ ఆయన సినిమా అవుట్‌పుట్ చూశాకే రేట్లు కోట్ చేశారు. ఇప్పుడు ‘వారణాసి’ని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. అంటార్కిటికా మంచు గడ్డలపై షూటింగ్ చేస్తున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ మూవీకి, రిలీజ్ దగ్గర పడే కొద్దీ డిమాండ్ ఇంకా పెరుగుతుందని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు.
వారణాసి హక్కుల కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు హిందీ బెల్ట్, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా భారీ పోటీ నెలకొంది. స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఇప్పటికే జియో హాట్‌స్టార్ వంటి సంస్థలు రూ. 1000 కోట్ల డీల్‌ను ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. సినిమా వాల్యూని మరింత పెంచి, ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయాలనేది జక్కన్న టీమ్ మాస్టర్ ప్లాన్. 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.












