కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వరిసు’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా జయసుధ, శ్రీకాంత్, కిక్ శామ్.. వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ మూవీ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి టాక్ తెచ్చుకోవడంతో తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి.
తెలుగు వెర్షన్ ‘వారసుడు’ పేరుతో జనవరి 14న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా సోసో గా నమోదయ్యాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం
2.71 cr
సీడెడ్
0.82 cr
ఉత్తరాంధ్ర
0.74 cr
ఈస్ట్
0.37 cr
వెస్ట్
0.34 cr
గుంటూరు
0.35 cr
కృష్ణా
0.27 cr
నెల్లూరు
0.24 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
5.94 cr
‘వారసుడు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.13.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.5.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.8.26 కోట్ల షేర్ ను రాబట్టాలి.
ఈ వీక్ అంతా కూడా స్టడీగా రాణిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరో రెండు, మూడు రోజుల్లో సంక్రాంతి సెలవులు ముగుస్తాయి కాబట్టి..ఈలోపే మ్యాగ్జిమమ్ రాబట్టుకుంటే మంచిదని చెప్పాలి.