Varsha Bollamma: పెళ్లి వార్తలపై స్పందించిన వర్ష బొల్లమ్మ.. ఏం చెప్పారంటే?

తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటించి వర్ష బొల్లమ్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది స్వాతిముత్యం సినిమాతో వర్ష బొల్లమ్మ ఖాతాలో మరో సక్సెస్ చేరిందనే సంగతి తెలిసిందే. అయితే వర్ష బొల్లమ్మ పెళ్లి పీటలెక్కనుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత కొడుకుతో వర్ష బొల్లమ్మ పెళ్లి జరగనుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే సోషల్ మీడియాలో పెళ్లి వార్తల గురించి స్పందించిన వర్ష బొల్లమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పెళ్లి వార్తల గురించి ప్రచారంలోకి వచ్చిన లింక్స్ ను షేర్ చేసిన వర్ష బొల్లమ్మ వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. పెళ్లిచూపులు చూసి అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ తన గురించి వైరల్ అయిన వార్తలపై ఆమె సెటైర్లు వేశారు. ఆ అబ్బాయి ఎవరో నాకు చెబితే నేను కూడా మా ఇంటి వాళ్లకు చెప్పేస్తా అని వర్ష బొల్లమ్మ పేర్కొన్నారు. ప్రస్తుతానికి నా పెళ్లిచూపులు చూడాలంటే ఆహా ఓటీటీలోని స్వాతిముత్యం మూవీలో చూడండని వర్ష బొల్లమ్మ వెల్లడించారు.

వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్ న్యూస్ అని వర్ష బొల్లమ్మ పేర్కొన్నారు. వర్ష బొల్లమ్మ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఆ ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వర్ష బొల్లమ్మ స్పష్టత ఇవ్వడంతో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. వర్ష బొల్లమ్మ స్టార్ హీరోలకు జోడీగా నటించి మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వర్ష బొల్లమ్మ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వర్ష బొల్లమ్మ పరిమితంగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండటంతో ఆమెకు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus