Varudu KaavalenuTwitter Review: వరుడు కావలెను.. ఫ్యామిలీ ఆడియెన్స్ ఫిదా!

యువ హీరో నాగ శౌర్య చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరగా చలో సినిమా తర్వాత మళ్ళీ అలాంటి సక్సెస్ ను చూడలేదు. ఇప్పుడు ఎలాగైనా వరుడు కావలెను సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవాలని చూస్తున్నాడు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కించిన ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ పై నగవంశీ నిర్మించాడు. సంగీతం కూడా సినిమాకు మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది. సినిమాను చూసిన కొంతమంది నెటిజన్లు ట్విట్టర్ లో వారి స్టైల్ లో రివ్యూ లు ఇస్తున్నారు.

నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ వంటి టాలెంటెడ్ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక సినిమా సెకండాఫ్ మాత్రం కొంచెం స్లోగా ఉందని అంటున్నారు. క్లైమాక్స్ మాత్రం కొంచెం బెటర్ అని కూడా పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ మంచి ఫీల్ ను కలిగించి కథలోకి తీసుకు వెళతాయని కూడా ట్వీట్స్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కాస్త స్లోగా అనిపించినప్పట్టికి హీరో హీరోయిన్ వారి నటనతో ఎంతగానో ఆకట్టుకున్నట్లు చెబుతున్నారు.

ఫైనల్ గా సినిమాకు కాస్త మిక్స్ డ్ టాక్ కూడా వస్తున్నట్లు అర్ధమవుతోంది. కొంత మంది బాగుంది అని అంటున్నారు కానీ మరికొందరు మాత్రం యావరేజ్ అని చెబుతున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రమే ఈ సినిమా ఎక్కువగా నచ్చుతుందని కూడా చెబుతున్నారు. అయితే నాగ శౌర్య, రీతూ వర్మ మాత్రం వారి పాత్రలకు తగ్గట్టుగా చాలా బాగా నటించారని కొన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మేకింగ్ విధానం కూడా చాలా బాగుంది అంటున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి. ఇక మరికాసేపట్లో రాబోయే వరుడు కావలెను పూర్తి రివ్యూ కోసం ఫిల్మీ ఫోకస్ ను చూస్తూ ఉండండి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus