తెలుగు లో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. అప్పుడే ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చిన వాళ్లకు, అలాగే సినిమాల్లో ఆర్టిస్టులుగా కొన్నాళ్ళు కొనసాగి, ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్లకు ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఇచ్చే బూస్ట్ మామూలుది కాదు. ఉదాహరణకి శివాజీ ని తీసుకుందాం. ఇతను సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది. జనాలు ఈయనని అసలు మర్చిపోయారు.
కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా హౌస్ లో ఉన్న అందరికంటే ఎక్కువ క్రేజ్ ని దక్కించుకొని ఆడియన్స్ కి ఎంతో దగ్గర అయ్యాడు. అలా అప్పట్లో వరుణ్ సందేశ్ కి కూడా బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈయన తన భార్య రితికా తో కలిసి హౌస్ లోకి వచ్చాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత తనకి, తన భార్య కి ఎదురైనా కొన్ని సంఘటనల గురించి వరుణ్ సందేశ్ రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ నా భార్య బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా లో తనకి పెట్టిన మెసేజిలను చూసి ఎంతో మనస్తాపానికి గురి అయ్యింది. చాలా రోజులు తను మనిషి లాగానే లేదు. చనిపోవాలి అనే రేంజ్ డిప్రెషన్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ యాజమాన్యం వాళ్లకి రేటింగ్స్ వచ్చే విధంగా, ఎన్నో కట్స్ చేసి టీవీ లో టెలికాస్ట్ చేసారు. పాపం రితికా అవి చూసి, అరేయ్ ఇది చూడురా, అసలు ముందు జరిగింది
ఏమిటో చూపించకుండా ఎడిట్ చేసి టెలికాస్ట్ చేసారు అంటూ నాతో చెప్పుకొని ఏడ్చేది. కొన్ని మెసేజిలు ఎలాంటివి వచ్చాయి అంటే మన నోటి తో చెప్పలేం, అలాంటి బూతులు తిట్టారు. కేవలం ఒక గంట ఎపిసోడ్ ని చూసి ఒక మనిషి వ్యక్తిత్వం ని ఎలా డిసైడ్ చేస్తారు అంటూ రితికా ఏడుస్తూ ఉండేది అంటూ వరుణ్ సందేశ్ (Varun Sandesh) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.