Varun Sandesh: తన బిగ్ బాస్ జర్నీ పై స్పందించిన వరుణ్ సందేశ్.!

వరుణ్ సందేశ్ (Varun Sandesh) అందరికీ సుపరిచితమే. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హ్యాపీడేస్’  (Happy Days) చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’ ‘ఏమైంది ఈవేళ’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. ఇంకా పలు సినిమాల్లో నటించాడు కానీ..అవేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినా ఏవీ అతనికి కలిసి రాలేదు. దీంతో కొన్నాళ్ళు సినిమాలకి గ్యాప్ ఇచ్చాడు. ఇంకో రకంగా సినీ పరిశ్రమకు కూడా దూరంగా ఉన్నాడు అని చెప్పాలి.

ఆ తర్వాత తన భార్య వితికతో (Vithika Sheru) కలిసి ‘బిగ్ బాస్ 3 ‘ లో పాల్గొన్నాడు. బిగ్ బాస్ తో ప్రేక్షకులకి ఓ కొత్త వరుణ్ సందేశ్ పరిచయమయ్యాడు అని చెప్పొచ్చు. అతను గేమ్ ఆడిన తీరు, నిజాయితీ.. అన్నీ కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.కానీ వరుణ్ సందేశ్ విన్నర్ కాలేదు. ఇదిలా ఉండగా… వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే సినిమా రూపొందింది. జూన్ 21 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించాడు వరుణ్ సందేశ్.

ఈ క్రమంలో ‘ ‘బిగ్ బాస్’ అనేది మీ కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడింది?’ అని వరుణ్ సందేశ్ కి ఓ ప్రశ్న ఎదురైంది?’ దీనికి అతను ” ‘బిగ్ బాస్’ అనేది నా సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ ఇచ్చిందా లేదా అనేది నాకు కూడా తెలీదు. కానీ నా ఆర్థిక ఇబ్బందులు అయితే ఆ షో వల్ల తీరాయి. మా ఫ్యామిలీ సెటిల్డ్ అయినప్పటికీ.. నేను రెండేళ్లు ఖాళీగా ఉన్నాను ఆ టైంలో..!

నేను నా బ్యాక్ గ్రౌండ్ పై ఆధారపడే రకం కాదు. అలాంటి టైంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. అప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. 105 రోజులు హౌస్ లో ఉన్నాను. హౌస్ నుండి బయటకు వచ్చాక.. అభిమానులు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం ‘హ్యాపీ డేస్’ ‘కొత్త బంగారు లోకం’ ..ల సినిమాలు ఇచ్చిన హిట్లకంటే కూడా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus