స్క్రిప్ట్ చదివి వరుణ్ తప్పించుకొన్నాడు.. చైతూ దొరికిపోయాడు!

మన హీరోలు ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాలు వదులుకొన్న సందర్భాలున్నాయి. అలాగే.. డిజాస్టర్ల బారి నుండి తప్పించుకొన్న సంఘటనలూ ఉన్నాయి. అలాంటి ఒక సంఘటన తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ విషయంలో జరిగింది. నిజానికి.. “సవ్యసాచి” సినిమాను తొలుత వరుణ్ తేజ్ తో చేద్దామనుకొన్నారట. మైత్రీ మూవీ మేకర్స్ కాకుండా వేరే నిర్మాత డబ్బు కూడా రెడీ చేశాడట. పాయింట్ విన్న వరుణ్ చేద్దామనే చెప్పాడట కూడా. అయితే.. బౌండె స్క్రిప్ట్ చదివిన తర్వాత వరుణ్ తన నిర్ణయాన్ని మార్చుకొని.. ఆ ప్రొజెక్ట్ నుంచి తప్పుకొన్నాడట. ఆ తర్వాత అటు వెళ్ళి, ఇటు వెళ్ళి ఆ ప్రొజెక్ట్ చివరికి చైతూ చేతికి చిక్కింది. ఇక రిజల్ట్ ఏమయ్యింది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి.

ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ తమ కెరీర్ లోనే మొదటి ఫ్లాప్ ను చవిచూడడం గమనార్హం. అలాగే.. ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయట. దాంతో ఆ నష్టాలను తిరిగి చెల్లించే పనిలో ఉన్నారట మైత్రీ నిర్మాతలు. సో, “ఫిదా, తొలిప్రేమ” లాంటి సూపర్ హిట్స్ తర్వాత వరుణ్ ఒక ఫ్లాప్ సినిమాను తప్పించుకొన్నాడన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus