Varun Tej: ఇంటర్వ్యూ : ‘గాండీవదారి అర్జున’ గురించి వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్లు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాండీవదారి అర్జున’. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 25 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడిన కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం :

ప్ర) ‘గాండీవదారి అర్జున’ కథలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది ఏంటి?

వరుణ్ తేజ్ : డైరెక్టర్ ప్రవీణ్ పై నాకు మొదటి నుండి మంచి ఒపీనియన్ ఉంది. ఎప్పుడూ కూడా తను రెగ్యులర్ సినిమాలు చేయడు అనే నమ్మకం ఉంది. అందుకే నేను ‘గని’ సినిమా చేస్తున్న టైంలో అతను కథ చెబుతాను అన్నప్పుడు ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమాలో అతను ఏదైతే ఇష్యు గురించి చెప్పాలి అనుకున్నాడో, అది నాకు బాగా నచ్చింది.వెంటనే ఓకే చెప్పేశాను.

ప్ర) కథ విన్నప్పుడు ఎలా ఉన్నా.. దానిని తెరకెక్కించే విధానం పై డౌట్ రాలేదా?

వరుణ్ తేజ్ : అంటే.. కథ విన్నప్పుడు.. ఇందులో యాక్షన్ ఉంది, ఫారెన్ లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాం అని నేను ఎక్సైట్ అవ్వలేదు. ఎంత స్టైలిష్ మేకింగ్ సెటప్ ఉన్నా సబ్స్టెన్స్ లేకపోతే ఏదీ వర్కౌట్ అవ్వదు.

ప్ర) ప్రవీణ్ సత్తార్.. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు? ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి?

వరుణ్ తేజ్ : ఇందులో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉంటాయి. ప్రవీణ్ సత్తార్ గారు.. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండాలి అనే దానిపై ఓ డిజైన్ వేసుకుంటారు. ఫైట్ మాస్టర్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. ఈ సినిమాలో కొన్ని షాట్స్ కి రూఫ్స్ కూడా లేకుండా చేయడం జరిగింది. కొంచెం గాయాలయ్యాయి కూడా..!

ప్ర) హీరోయిన్ సాక్షి వైద్యతో పని చేయడం ఎలా అనిపించింది?

వరుణ్ తేజ్ : ఆ అమ్మాయి చాలా హార్డ్ వర్కర్. షాట్ రెడీ అనగానే 3,4 పేజీల డైలాగులు చక..చకా చెప్పేసేది.

ప్ర) ఈ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందట… నిర్మాత సహకారం ఎలా ఉంది?

వరుణ్ తేజ్ : ‘గాండీవదారి అర్జున’ సినిమా షూటింగ్ విదేశాల్లో జరిగింది. అక్కడ రోడ్లు బ్లాక్ చేయడం వంటివి ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ టైంలో వర్షాలు కూడా పడ్డాయి. కాబట్టి.. అక్కడ ఎక్కువ రోజులు స్టే చేయాలి. సో టెక్నికల్ టీంకి రూ.50 లక్షలు అలా అయిపోతాయి. నిర్మాత సహకారం లేకుండా ఇలాంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేం..!

ప్ర) మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి?

వరుణ్ తేజ్ : ఇప్పుడు సినిమా గురించి అరగంట చెప్పాను. నా లవ్ స్టోరీ గురించి పావు గంట చెబితే, దాని గురించే హెడ్డింగ్లు పెడతారు.(నవ్వుతూ). ఆల్మోస్ట్ 7 ఏళ్ళు అయ్యింది నా లవ్ స్టోరీ మొదలయ్యి. సో నాకే సరిగ్గా గుర్తులేదు.

ప్ర) మీ కటౌట్ కి పాన్ ఇండియా సినిమాలు సరిపోతాయి కదా.. ఎందుకు చేయడం లేదు?

వరుణ్ తేజ్ : ఇప్పుడు సినిమాకి లాంగ్వేజ్ వంటి బౌండరీస్ లేవు. ఏ భాషలో సినిమా చేసినా వర్కౌట్ అవుతుంది.నా నెక్స్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. డబ్బింగ్ కోసం హిందీ కూడా నేర్చుకుంటున్నాను.

ప్ర) ‘గాండీవదారి అర్జున’ సినిమాపై హైప్ పెద్దగా లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి?

వరుణ్ తేజ్ : ఓవర్ హైప్ చేయడం ఇష్టం లేదు. కానీ కచ్చితంగా మా సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. సో జనాలకు రీచ్ అవుతుంది అనే నమ్మకం ఉంది.

ప్ర) ఈ సినిమా ‘చందమామ కథలు’ అలాగే ‘పీఎస్వీ గరుడ వేగ’ కలిపితే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది అని డైరెక్టర్ అన్నారు?

వరుణ్ తేజ్ : ఆ రెండు సినిమాలు నేను (Varun Tej) చూశాను. ‘చందమామ కథలు’ లో మంచి ఎమోషన్ ఉంటుంది.. ‘పీఎస్వీ గరుడవేగా’ లో మంచి యాక్షన్ ఉంటుంది. ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్.. రెండూ ఉంటుంది.

ప్ర) ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ ను తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?

వరుణ్ తేజ్ : మిక్కీ జె మేయర్ ఇలాంటి జోనర్ సినిమాలు ఎప్పుడూ చేయలేదు. కానీ మంచి ఔట్పుట్ ఇచ్చాడు. అతని కెరీర్ కి ఇంకా హెల్ప్ అయ్యే సినిమా ఇది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?

వరుణ్ తేజ్ : ‘మట్కా’ అలాగే ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలు వస్తున్నాయి. రెండూ కూడా చాలా కొత్తగా ఉంటాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus