Ghani: ఆ సెంటిమెంట్ వల్ల గనికి ఇబ్బందేనా?

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ నటించిన గని సినిమా వచ్చే నెల 24వ తేదీన రిలీజ్ కానుంది. ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్ తేజ్ గని సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎఫ్3, గద్దలకొండ గణేష్ సినిమాలు వరుణ్ తేజ్ కు క్రేజ్ తో పాటు మార్కెట్ ను పెంచాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

అదే రోజున శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గని సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ఈ సినిమాలో బాక్సర్ గా కనిపిస్తుండగా స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఒక సెంటిమెంట్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. వరుణ్ తేజ్ తొలి సినిమా ముకుంద 2014 సంవత్సరంలో డిసెంబర్ 24వ తేదీన రిలీజైంది.

అయితే అదే తేదీకి ఏడేళ్ల తర్వాత గని రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వరుణ్ తేజ్ కు జోడీగా ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా జగపతిబాబు, నవీన్ చంద్ర, నదియా, ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus