Varun Tej: గని సినిమా కోసం ఎంతో కష్టపడ్డా… కానీ?

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఈయన గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే ఎఫ్3 సినిమాతో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో చేస్తున్నారు.

ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.ఇలా మొదటిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా ఈయన కనిపించనున్నారు.ఇలా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో ఈ పాత్రకు అనుగుణంగా ఎంతో మంది పైలెట్లను కలిసి వారి జీవితాన్ని చాలా దగ్గరగా చూడడమే కాకుండా వారితో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని తాజాగా ఈయన సందర్భంగా వెల్లడించారు.

ఇక ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో కొంత ఎక్సైజ్మెంట్ ఉన్నప్పటికీ మరోవైపు కంగారుగా కూడా ఉందని తెలియజేశారు.కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించుకున్నాయి. నేను కూడా ప్రతి ఒక్క సినిమాకి బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఇక గని సినిమా గురించి ఈయన మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను

ఈ సినిమాలో చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నానని అయితే ఈ సినిమా తనని నిరాశపరిచినప్పటికీ తాను తీసుకున్న శిక్షణ తనకు ఎంతో ప్రయోజనం అయింది అంటూ ఈయన తెలిపారు. ఇక తాను తన కెరియర్లో విజయాల కన్నా ఫెయిల్యూర్ నుంచి ఎక్కువగా నేర్చుకున్నానని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus