బాక్సింగ్ రింగ్ లో దిగడానికి సిద్దమైన మెగా హీరో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గ్లోవ్స్ కట్టుకొని బాక్సింగ్ రింగ్ లో దిగడానికి సిద్దమయ్యాడు. ప్రత్యర్థులపై ఆయన పంచ్ పవర్ చూపించనున్నాడు. గద్దలకొండ గణేష్ గా ఊర మాస్ అవతారంలో వీర విహారం చేసిన వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం క్రీడా నేపథ్యంలో చేస్తున్నారు. వరుణ్ 10వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆయన ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నారు. దీని కోసం వరుణ్ నిపుణుల సమక్షంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం కొరకు బాగా కష్టపడి బరువు కూడా తగ్గాడట ఈ యంగ్ హీరో. ఈ చిత్రంలో వరుణ్ లుక్ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని వినికిడి.

కాగా వరుణ్ శిక్షణ పూర్తి కావడంతో దర్శకుడు రెగ్యులర్ షూట్ కి ప్రణాళిక వేశారట. మరో వారం రోజుల లోపు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ విషయాన్ని వరుణ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. నిరవధికంగా చిత్రీకరణ జరిపి సమ్మర్ కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. రినైజెన్సు పిక్టర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ఆయన పెద్ద కుమారుడు అల్లు వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ స్వరాలు అందిస్తున్నారు.

వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న వరుణ్ తన కెరీర్ ని మిగతా మెగా హీరోలకు భిన్నంగా ప్లాన్ చేసుకుంటున్నారు. 2014 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుందా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ ఐదేళ్ల కెరీర్ లో కంచె, అంతరిక్షం, గద్దలకొండ గణేష్ వంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించారు. వరుణ్ నటించిన ఫిదా, ఎఫ్2 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కాగా తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ గా నిలిచాయి.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus