Varun Tej: ఫ్యాన్స్‌ హార్ట్‌ బ్రేక్‌ చేశావు అంటే.. వరుణ్‌ తేజ్‌ ఏమన్నాడో చూశారా?

‘గాండీవధారి అర్జున’ సినిమా ప్రచారంలో తన పెళ్లి గురించి అడుగుతున్నారు తప్ప.. సినిమా గురించి అడగడం లేదు అని అన్నాడు గుర్తుందా? ఇప్పుడు ఆయన సోషల్‌ మీడియాలోకి వచ్చినా సినిమా గురించి తప్ప ఇతర అంశాల గురించే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా వరుణ్‌ తేజ్‌ ట్విటర్‌లో కాసేపు అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర ప్రశ్నలు వచ్చాయి. వాటికి ఆయన సమాధానాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి.

‘గాండీవధారి అర్జున’ కథను దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు చెప్పినప్పుడు కథలోని ఎమోషన్‌కు బాగా కనెక్ట్‌ అయ్యానని, ఆ తర్వాత దర్శకుడిని బాగా నమ్మి సినిమా చేశానని చెప్పాడు వరుణ్‌. మరి ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడొచ్చా అని అడిగితే.. హ్యాపీగా అందరూ కలసి ఫ్యామిలీతో వెళ్లి చూడండి అని చెప్పాడు. ఈ సినిమాలో యాక్షన్‌ ఎలిమెంట్స్‌ కూడా బాగానే ఉంటాయని, అయితే దాంతో పాటు ఓ సందేశం కూడా ఇస్తామని చెప్పాడు.

ఇప్పటివరకు ‘ఆపరేషన్‌ వాలెంటైన్’ మాత్రమే పాన్‌ ఇండియా సినిమా అని అనుకుంటుండగా.. దాంతోపాటు కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందబోయే ‘మట్కా’ కూడా పాన్‌ ఇండియా స్థాయి సినిమానే అని చెప్పాడు వరుణ్‌. మొన్నీమధ్య పవన్‌ కల్యాణ్‌తో మల్టీస్టారర్‌కి రెడీ అని చెప్పిన వరుణ్‌ తేజ్‌.. ఇప్పుడు రామ్‌చరణ్‌తో కూడా రెడీ అని చెప్పాడు. దీంతో ఇప్పుడు కథలు సిద్ధం చేసే పని దర్శకరచయితల మీద ఉంది. ఎవరు మరి ముందుకొస్తారో చూడాలి.

వరుణ్‌తేజ్‌ (Varun Tej) కెరీర్‌లో ‘తొలిప్రేమ’ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ ప్లెజెంట్‌ లవ్‌స్టోరీ స్టైల్‌ మూవీస్‌ వరుణ్‌ నుండి రావాలి అని కోరుకుంటారు ఫ్యాన్స్‌. అలా కమర్షియల్‌ సినిమాలు కూడా కావాలి అంటుంటారు. ఇలాంటి సినిమాలు త్వరలోనే తన నుండి వస్తాయి అని మాటిచ్చేశాడు వరుణ్‌. ఇక లావణ్య త్రిపాఠి ప్రస్తావన లేకుండా ఈ చిట్‌చాట్‌ ఎలా ఉంటుంది చెప్పండి. అయితే ఆమె పేరు లేకుండానే ఓ అమ్మాయి.. ‘నీ లేడీ ఫ్యాన్స్‌ హార్ట్‌ బ్రేక్‌ చేశావ్‌ వరుణ్‌’ అంటూ అంతే సరదాగా ‘తప్పు అయిపోయింది’ అని రిప్లై ఇచ్చాడు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus