Tholi Prema Collections: ‘తొలిప్రేమ’ కి 6 ఏళ్ళు .. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘ఫిదా’ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ .. ఆ తర్వాత కథల విషయంలో చాలా శ్రద్ద వహించడం మొదలుపెట్టాడు. అలా తర్వాత అతని నుండి వచ్చిన సినిమా ‘తొలి ప్రేమ’. నటుడు వెంకీ అట్లూరి డైరెక్టర్ గా మారుతూ చేసిన ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(ఎస్వీసిసి) బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.రాశీ ఖన్నా ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. దీంతో మొదటి నుండి ఈ సినిమా అంచనాలు పెరిగాయి.

2018 ఫిబ్రవరి 10 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో రిలీజ్ అయినా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 7.00 cr
సీడెడ్ 2.25 cr
ఉత్తరాంధ్ర 3.00 cr
ఈస్ట్ 1.60 cr
వెస్ట్ 1.21 cr
గుంటూరు 1.40 cr
కృష్ణా 1.50 cr
నెల్లూరు 0.58 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.25 cr
 ఓవర్సీస్ 3.16 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 23.95 cr (షేర్)

‘తొలి ప్రేమ’ (Tholi Prema) చిత్రం రూ.20.70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.23.95 కోట్ల షేర్ ను రాబట్టింది. అలా రూ.3.25 కోట్ల లాభాలతో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus