2002 లో వెంకటేష్ (Venkatesh Daggubati) హీరోగా వచ్చిన ‘వాసు’ ‘జెమిని’ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైంలో తమిళ దర్శకుడు విక్రమన్ తో ‘వసంతం’ (Vasantam) చేశాడు. ‘శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్ (N. V. Prasad) మరియు ఎస్.సాయి నాగ అశోక్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.2003, జూలై 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రాజమౌళి (S. S. Rajamouli) – ఎన్టీఆర్ (Jr NTR) ల ‘సింహాద్రి’ (Simhadri) వంటి బ్లాక్ బస్టర్ మూవీ పక్కన రిలీజ్ అయినప్పటికీ ‘వసంతం’ సినిమా హిట్ టాక్ ని సంపాదించుకుంది.
వెంకటేష్ కి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ వల్ల ‘వసంతం’ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పాలి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తయ్యింది. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఒక లుక్కేద్దాం రండి :
| నైజాం | 5.22 cr | 
| సీడెడ్ | 1.35 cr | 
| ఉత్తరాంధ్ర | 1.26 cr | 
| ఈస్ట్ | 0.53 cr | 
| వెస్ట్ | 0.55 cr | 
| గుంటూరు | 0.80 cr | 
| కృష్ణా | 0.85 cr | 
| నెల్లూరు | 0.33 cr | 
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 10.89 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.47 Cr | 
| వరల్డ్ వైడ్ (టోటల్) | 13.36 cr | 
‘వసంతం’ చిత్రం రూ.8.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫైనల్ గా ఈ సినిమా రూ.13.36 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.4 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి సూపర్ హిట్ గా నిలిచింది ‘వసంతం’ చిత్రం.