Vasanthi: ఎలిమినేషన్ లో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్..! ఆఖరి నిమిషంలో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత నాటకీయంగా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఈవారం డబుల్ ఎలిమినేషన్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా శనివారం డైరెక్ట్ గా బాలాదిత్యని ఎలిమినేట్ చేసేశారు. గీతురాయల్ ఎలిమినేట్ అయిపోయిన దగ్గర్నుంచీ బాలాదిత్య బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ మానేశాడు. ఒక్క సిగరెట్ కూడా తాగలేదు. దీంతో బాలాదిత్య విల్ పవర్ ని పొగుడుతూ నాగార్జున అభినందించాడు.

ఇక బాలాదిత్య వెళ్లపోతూ హౌస్ మేట్స్ ని పలకరించాడు. ఎవరి వీక్ నెస్ ఏంటి అనేది చెప్పాడు. బాలాదిత్య వెళ్లిపోయిన తర్వాత నాగార్జున మిగతా నామినేషన్స్ లో ఉన్నవారిలో కూడా మరో ఎలిమినేషన్ ఉండబోతోందని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. బాలాదిత్య ఎలిమినేట్ అవుతాడని అస్సలు అనుకోలేదు హౌస్ మేట్స్. అయితే, అందర్నీ హ్యాపీగా పలకరిస్తూ 10 వారాల పాటు హౌస్ లో ఉన్నాను చాలంటూ హ్యాపీగా వెళ్లిపోయాడు బాలాదిత్య.

ఇక సోషల్ మీడియాలో బాలాదిత్యతో పాటుగా మెరీనా కూడా ఎలిమినేట్ అయిపోయినట్లుగా న్యూస్ వచ్చింది. అందరూ బాలాదిత్య ఇంకా మెరీనా ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారని అనుకున్నారు. కానీ, మెరీనా వాసంతీ ఇద్దరిలో వాసంతీ ఎలిమినేట్ అయిపోయినట్లుగా సమాచారం తెలుస్తోంది. చివరి నిమిషంలో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడని, మెరీనా ప్లేస్ లో వాసంతీని ఎలిమినేట్ చేశారని చెప్తున్నారు. నిజానికి అన్ అఫీషియల్ ఓటింగ్ లో చూస్తే ఫైమా, వాసంతీ , కీర్తి ఈ ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు.

వాసంతీ ఫస్ట్ వీక్ నుంచీ కూడా ఆటలో వెనకబడింది. తన వరకూ వస్తేనే కానీ ఏది స్పందించలేదు. వాసంతీతో పోలిస్తే , మెరీనా హౌస్ లో ఉండటమే బెటర్ అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. మరి వాసంతీ ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ లో వాసంతీ జెర్నీ 10వ వారం ముగిసినట్లే. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus