Veera Dheera Soora Collection: హిట్ టాక్ వచ్చింది.. కానీ కలెక్షన్స్ మాత్రం?

‘తంగలాన్’ తర్వాత విక్రమ్  (Vikram)  నుండి ‘వీర ధీర శూర'(Veera Dheera Soora) అనే వచ్చిన సంగతి తెలిసిందే. ‘సేతుపతి’ (Vijay Sethupathi) ‘చిన్నా’ వంటి సినిమాలు తీసిన ఎస్.యు.అరుణ్ కుమార్ (S. U. Arun Kumar) దర్శకుడు. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా ‘వీర ధీర శూర’ మార్నింగ్ షోలు, మ్యాట్నీలు క్యాన్సిల్ అయ్యాయి. ఫైనల్ గా అన్ని అడ్డంకులు తొలగించుకుని ఈవెనింగ్ షోలు పడ్డాయి. ఎస్.జె.సూర్య (S. J. Suryah) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) కూడా విలన్ రోల్ చేస్తుండటం మరో ఆసక్తికర విషయం.

Veera Dheera Soora Collections:

తెలుగులో ఈ సినిమాని ఎన్.వి.ఆర్ సినిమాస్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. విక్రమ్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ఆడియన్స్ కామెంట్స్ చేశారు. కానీ వీక్ ప్రమోషన్స్ కారణంగా ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.16 కోట్లు
సీడెడ్ 0.07 కోట్లు
ఆంధ్ర(టోటల్) 0.13 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.36 కోట్లు

‘వీర ధీర శూర’ చిత్రానికి రూ.3.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.6 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.36 కోట్లు షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.0.60 కోట్లు వచ్చింది. ‘ఎల్ 2 : ఎంపురాన్’ ‘మ్యాడ్ స్క్వేర్’ ‘రాబిన్ హుడ్’ వంటివి ఉన్నప్పటికీ బాగానే పికప్ అయ్యింది అని చెప్పాలి. కానీ పండుగ సెలవులు వాడుకోకపోతే బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం.

Robinhood Collections: ‘రాబిన్ హుడ్’ .. చాలా పూర్ ఓపెనింగ్స్!

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus