నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్.. లు హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాకి హైప్ పెరిగింది.
మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.మొదటివారం ఈ మూవీ సంక్రాంతి పండుగ పేరు చెప్పుకుని బాగా క్యాష్ చేసుకుంది. కానీ రెండో వారం సోసో గానే కలెక్ట్ చేసింది. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 16.64 cr |
సీడెడ్ | 16.10 cr |
ఉత్తరాంధ్ర | 7.34 cr |
ఈస్ట్ | 5.52 cr |
వెస్ట్ | 4.16 cr |
గుంటూరు | 6.24 cr |
కృష్ణా | 4.45 cr |
నెల్లూరు | 2.85 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 63.30 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.74 cr |
ఓవర్సీస్ | 5.73 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 73.77 cr (షేర్) |
‘వీరసింహారెడ్డి’ చిత్రానికి రూ.67.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.68 కోట్ల షేర్ ను రాబట్టల్సి.. ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.73.77 కోట్ల షేర్ ను రాబట్టి ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి రూ.5.77 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.ఫుల్ రన్లో ‘అఖండ’ కలెక్షన్స్ ను అధిగమించే అవకాశాలు అయితే కనిపించడం లేదు.
హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!