Veera Simha Reddy First Review: మాస్ ఆడియన్స్ కు, ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ అంతే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో రవి శంకర్, నవీన్ ఎర్నేని ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. క్రాక్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని, అఖండ తర్వాత బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందిన మూవీ కాబట్టి.. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.పాటలు సూపర్ హిట్ అయ్యాయి, ట్రైలర్ సూపర్ గా ఉంది. సెన్సార్ రిపోర్ట్ కూడా అదిరిపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు ఈ చిత్రాన్ని వీక్షించి రివ్యూ ఇచ్చాడు. అది ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

సినిమాకు ఎ టు జెడ్ బాలయ్య నిలిచారట . రెండు పాత్రల్లో ఆయన చూపించిన వేరియేషన్స్ అద్బుతం అని ఆయన తెలిపాడు. మాస్ ఆడియన్స్‌ కు అలాగే బాలయ్య అభిమానులకు స్క్రీన్ పై ఆయన కనబడగానే పూనకాలు రావడం గ్యారెంటీ అని చెప్పాడు. బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ బాలయ్య చెప్పడం ఆ వెంటనే తమన్ అందించాడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూజ్ బంప్స్ తెప్పిస్తాయట..!

ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయట. డాన్స్, ఇంటర్వల్ సీన్, ఫైట్స్, క్లైమాక్స్ 15 నిమిషాలు సినిమా చూస్తున్న ప్రేక్షకులను కట్టి పడేస్తాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇంత పాజిటివ్ రివ్యూ ఇచ్చి.. 3.5/5 రేటింగ్ ఇచ్చాడు ఉమైర్ సంధు. ఇతని రివ్యూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది కానీ.. చాలా సందర్భాల్లో ఈయన రివ్యూ తప్పైన సందర్భాలు కూడా ఉన్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus