Veera Simha Reddy: సీమపై దృష్టి పెట్టిన బాలయ్య.. ఈవెంట్ ఎక్కడంటే?

చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జనవరి 8వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరు కానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జనవరి 6వ తేదీన ఈ సినిమా ఈవెంట్ జరగనుందని సమాచారం.

అనంతపురంలో ఈ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వీరసింహారెడ్డి తెరకెక్కుతున్న నేపథ్యంలో అనంతపురంలో ఈ ఈవెంట్ జరపాలని బాలయ్య భావించారని బోగట్టా. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఈవెంట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన సుగుణ సుందరి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. బాలయ్య శృతి హాసన్ జోడీ తెరపై అందంగా కనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. థమన్ ఈ పాటతో అభిమానుల అంచనాలను అందుకున్నారనే చెప్పాలి. వెండితెరపై ఈ సాంగ్ మరింత అందంగా కనిపించే ఛాన్స్ అయితే ఉంది.

కొత్త విగ్ బాలకృష్ణకు బాగా సెట్ అయిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ట్యూన్ విషయంలో కూడా థమన్ పై ట్రోల్స్ రాలేదు. ఈ సినిమాలోని మిగతా పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus