Veera Simha Reddy: తండ్రీకొడుకు పాత్రల్లో బాలయ్య.. అలా కనిపిస్తారంటూ?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ వార్త సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చిందనే సంగతి తెలిసిందే.

అయితే బాలకృష్ణ ఈ సినిమాలో తండ్రీకొడుకు పాత్రలలో కనిపించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ ప్రకారం వీరసింహారెడ్డి రాయలసీమలోని ఫ్యాక్షన్ లీడర్ కాగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆ సమస్యలను వీరసింహారెడ్డి పరిష్కరిస్తూ ఉంటారు. దునియా విజయ్ తో పాటు సోదరి వరలక్ష్మితో కూడా వీరసింహారెడ్డికి తగాదాలు ఉంటాయి. ఒక సందర్భంలో వీరసింహారెడ్డిని శత్రువులు హతమార్చగా వీరసింహారెడ్డి మరణిస్తాడు.

ఈ విషయం తెలిసి విదేశాల్లో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్న వీరసింహారెడ్డి కొడుకు తండ్రిని చంపిన వారిపై ఏ విధంగా పగ తీర్చుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. కథ రొటీన్ గానే ఉన్నా కథనం కొత్తగా ఉంటుందని యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం. థమన్ ఈ సినిమా మ్యూజిక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య సినిమాకు థమన్ మరోసారి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారని తెలుస్తోంది. వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. అఖండ సినిమాను మించి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. బాలయ్య సినీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus