Veera Simha Reddy OTT: వీర సింహా రెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్‌ స్పెషల్‌ డేట్‌ వచ్చేసింది!

  • February 13, 2023 / 09:40 AM IST

సంక్రాంతికి బాక్సాఫీసు వేటకు వచ్చి.. అదగొట్టాడు మన సీమ సింహం అలియాస్‌ ‘వీర సింహా రెడ్డి’. ఇప్పుడు తన వేట రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నాడు. ఈ మేరకు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఓ ట్వీట్‌ చేసింది. ఇప్పటికే అర్థమైపోయుంటుంది.. ఆ ట్వీట్ ఏంటో.. దాని సంగతేంటో. అఁ.. అదే నందమూరి బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేనిల ‘వీర సింహా రెడ్డి’ స్ట్రీమింగ్‌ డేట్‌ను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ అనౌన్స్‌ చేసింది. దీంతో అభిమానులు మరోసారి తమ సత్తా చాటడానికి రెడీ అయిపోతున్నారు.

బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’. శ్రుతి హాసన్‌, హనీ రోజ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చిన విషయం తెలిసిందే. రూ. వంద కోట్లకుపైగా వసూళ్లతో అదరగొట్టిన ఈ సినిమాను ఇప్పుడు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ మేరకు టీమ్‌ అనౌన్స్‌ చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ హక్కుల్ని హాట్‌స్టార్‌ కైవసం చేసుకుందని ఎప్పుడో తెలిసినా.. ఇప్పుడు డేట్‌ అనౌన్స్‌ చేశారంతే.

ఇక నందమూరి బాలయ్య గత బ్లాక్‌బస్టర్‌ ‘అఖండ’ ఇదే ఓటీటీలో వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఆ రోజుల్లో భారీ స్ట్రీమింగ్‌ వచ్చింది. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో వీక్షించారు. ఆ సినిమాకొచ్చిన అప్లాజ్‌ను మరోసారి క్యాష్ చేసుకునేలా హాట్‌స్టార్‌ టీమ్‌.. ప్రచారం చేస్తోంది. ‘వీర సింహా రెడ్డి’ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయడానికి.. ‘అఖండ’ సినిమాను వాడుకున్నారు. అప్పుడు ‘అఖండ’.. ఇప్పుడు ‘వీర సింహా రెడ్డి’ అంటూ ప్రచారం చేస్తున్నారు.

జై అలియాస్ జై సింహా రెడ్డి (బాలకృష్ణ), ఆయ‌న‌ తల్లి మీనాక్షి (హనీ రోజ్) ఇస్తాంబుల్‌లో జీవిస్తుంటారు. ఓ అనుకోని సంఘ‌ట‌న వ‌ల్ల జైకు ఈషా (శ్రుతి హాసన్) పరిచయమవుతుంది. ఆ త‌ర్వాత ప్రేమలో పడి, పెళ్లికి సిద్ధ‌మ‌వుతారు. సంబంధం గురించి మాట్లాడ‌టానికి ఈషా తండ్రి.. జై తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మని చెబుతాడు.

అప్పటి వరకు తండ్రి లేడని అనుకుంటున్న‌ జైకు త‌న త‌ల్లి ఓ నిజం చెబుతుంది. త‌న బావ‌ వీర‌సింహారెడ్డి (బాల‌కృష్ణ‌)కి పుట్టిన బిడ్డ‌వ‌ని చెబుతుంది. ఈ క్రమంలో త‌న తండ్రి గ‌తం తెలుసుకున్న జై శత్రువుల‌కు ఎలా బుద్ధి చెప్పాడు? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus