Chiru, Balayya: వాల్తేరు వీరయ్య కి ఇంకో షాక్ ఇచ్చిన వీరసింహారెడ్డి!

2023 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ వంటి బడా హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకప్పటి రోజులు అయితే పోటీ పడుతున్నాయి అని చెప్పొచ్చు.. కానీ ఇప్పుడు వాళ్ళ సినిమాలను ఎగబడి చూసే రోజులు కాదు. కాబట్టి జస్ట్ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటి రోజుల్లో సినిమా బాగా ఆడాలి అంటే ప్రమోషన్ చాలా ముఖ్యం. ఈ రెండు సినిమాలకు నిర్మాతలు మైత్రి వారే కాబట్టి.. ప్రమోషన్ విషయంలో ఎక్కడా కూడా లోటు చేయడం లేదు.

కాకపోతే ఈ రెండు సినిమాల్లో ఎక్కువ క్రేజ్ వీర సింహారెడ్డి పైనే ఉన్నట్టు స్పష్టమవుతుంది. వీరయ్య.. పాటల కంటే వీరసింహా రెడ్డి పాటలే సూపర్ హిట్ అయ్యాయి. ప్రోమోస్ విషయంలో కూడా వీర సింహారెడ్డి పై చేయి సాధించింది. ఇప్పుడు ఓపెనింగ్స్ విషయంలో కూడా వీర సింహారెడ్డి హవా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఇది ఓవర్సీస్ సంగతి. ముఖ్యంగా యూఎస్ లో వీరసింహారెడ్డి 37 లొకేషన్లలో 75 షోలకు గాను $25K డాలర్స్ ను కలెక్ట్ చేసింది.

1421 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక వాల్తేరు వీరయ్య 32 లొకేషన్లలో 64 షోలకు గాను $17K డాలర్స్ ను వసూల్ చేసింది. 953 టికెట్ లు అమ్ముడయ్యాయి. ఇప్పటికైతే వీరసింహారెడ్డి హవా ఎక్కువగా కనిపిస్తుంది. మరి రిలీజ్ టైంకి ఎలా ఉంటుందో చూడాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus