Naga Chaitanya, Samantha: సమంత – చైతు విడాకులపై వెంకీ మామ సెటైర్!

  • October 6, 2021 / 09:51 AM IST

అక్కినేని నాగ చైతన్య సమంత పదేళ్ల ప్రేమ జీవితానికి తుది వీడ్కోలు పలుకుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని వారాలుగా విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్నా కథనాలకు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన ఈ జంట ప్రస్తుతం ఎవరి దారిన వాళ్ళు కొనసాగుతున్నారు. ఇక వారి నిర్ణయాన్ని పెద్దలు కూడా కాదనలేకపోయారు. మొదట చర్చలు జరిపి సర్ది చెప్పాలని అనుకున్నారు కానీ వారి ప్లాన్స్ ఏ మాత్రం సక్సెస్ అవ్వలేదు.

సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవైపు చైతు తండ్రి నాగార్జున తో పాటు అతని మామయ్య సురేష్ బాబు వెంకటేష్ కూడా చాలా చర్చలు జరిపారు. మధ్యలో సమంత చైతు ఇద్దరు కూడా కొంత ఆలోచించారు కానీ మళ్ళీ ఎప్పటిలానే విడిపోవాలని నిర్ణయాన్ని లేవనెత్తడంతో కుటుంబ సభ్యులు కాదనలేకపోయారు. ఇక ఇప్పటి వరకు నాగార్జున తో పాటు కొంత మంది సెలబ్రిటీలు కూడా విడాకులపై క్లియర్ గానే స్పందించారు.

ఇక నాగచైతన్య వెంకీ మామ కూడా తనదైన శైలిలో స్పందించారు. అయితే ఆయన కాస్త భిన్నంగా ప్రస్తుతం వస్తున్న కథనాలపై సెటైర్లు వేసినట్లు తెలుస్తోంది. మన నోరు తెరిచి ముందు కాస్త మైండ్ కూడా తెరిచి మాట్లాడాలని కౌంటర్ అయితే ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సామ్ చైతు విడిపోవడంపై గల కారణాలు చాలానే వినిపిస్తున్నాయి అవన్నీ మాట్లాడే ముందు మంచి ఆలోచన తో బుర్రను ఓపెన్ చేయాలని వెంకీ తనదైన శైలిలో కౌంటర్ వేసినట్లు అర్థమవుతుంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus