పెళ్లిచూపులు చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ మూవీతో జాతీయ అవార్డు గెలుచుకున్న ఆయన టాలీవుడ్ ని దున్నేయడం ఖాయం అనుకున్నారు. ఐతే ఈ దర్శకుడు మాత్రం ఆ స్థాయిలో దూసుకు వెళ్లడం లేదు. పెళ్లిచూపులు చిత్రం తరువాత ఆయన ఈ నగరానికి ఏమైంది? అనే ఓ విభన్నమైన సినిమా చేశారు. కాన్సెప్ట్ అండ్ టేకింగ్ పరంగా ఆ మూవీకి మంచి మార్కులు పడ్డా కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు.
ఆ మూవీ విడుదలై రెండేళ్లు దాటిపోతుంది. అయినా ఈ దర్శకుడు నుండి మరో చిత్రం రాలేదు. ఈ మధ్యలో నటుడిగా, హీరోగా కూడా చేశారు. డైరెక్షన్ పైన ఫోకస్ పెట్టకుండా మళ్ళీ యాక్టింగ్ అంటూ ఎందుకు డైవర్ట్ అవుతున్నాడనే విమర్శలు కూడా రావడం జరిగింది. ఐతే తరుణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విక్టరీ వెంకటేష్ తో సెట్ చేశారు. సురేష్ బాబు నిర్మించనున్న ఈ మూవీపై వీరి మధ్య చర్చలు కూడా సఫలం కావడం జరిగింది. ఎందుకో తెలియదు ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదు.
వెంకీ మామ మూవీ తర్వాత వెంకీ తరుణ్ భాస్కర్ మూవీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వెంకీ నారప్ప ప్రకటించడం జరిగింది. మరి ఈ చిత్రం తరువాతైనా మూవీ ఉంటుంది అనుకుంటే, ఆయన వచ్చే ఏడాది ఎఫ్ 3 ఉంటుంది అన్నారు కానీ, తరుణ భాస్కర్ మూవీపై క్లారిటీ ఇవ్వలేదు. దీనితో తరుణ్ భాస్కర్ కి షాక్ తగిలినట్టు అయ్యింది.
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!