Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

మెగాస్టార్ చిరంజీవి.. విక్టరీ వెంకటేష్.. ఈ ఇద్దరు స్టార్స్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరు లెజెండ్స్ ఇప్పటి వరకు కలిసి ఒక సినిమా చేయలేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చిరు నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

Venkatesh

ఈ సినిమాలో వెంకీ పాత్ర గురించి రీసెంట్ గా అనిల్ రావిపూడి ఒక క్రేజీ సీక్రెట్ బయటపెట్టారు. ఇందులో వెంకటేష్ ఒక కన్నడిగుడి పాత్రలో కనిపిస్తారట. తన పేరు వెంకీ గౌడ అని.. కర్ణాటక నుంచి వచ్చే ఒక మాస్ క్యారెక్టర్ అని దర్శకుడు వెల్లడించారు. ఒక తెలుగు స్టార్ హీరో ఇలా పక్కా కన్నడ టచ్ ఉన్న రోల్ లో కనిపించడం ఫ్యాన్స్ కు నిజంగా ఒక సర్ ప్రైజ్ అని చెప్పాలి.

సినిమా సెకండాఫ్ లో ఈ పాత్ర ఎంట్రీ ఉంటుందని.. సుమారు అరగంట పాటు వెండితెర మీద సందడి చేస్తారని యూనిట్ వర్గాల టాక్. చిరు.. వెంకీ కాంబినేషన్ లో వచ్చే సీన్లు థియేటర్లో నవ్వులు పూయిస్తాయని మేకర్స్ గట్టిగా చెబుతున్నారు. ఈ అరగంట పాటు ఉండే ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉంటుందని.. ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్తే అని అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు.

వెంకటేష్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తనకున్న అందరివాడు అనే ఇమేజ్ తో ఈ కన్నడ పాత్రను ఆయన ఈజీగా పండించగలరని అంతా నమ్ముతున్నారు. సినిమాలో ఏమైనా కన్నడ డైలాగులు కూడా ఉండబోతున్నాయా అనే క్యూరియాసిటీ ఇప్పుడు ఆడియన్స్ లో మొదలైంది. చిరు మాస్ యాక్షన్ కు.. వెంకీ కామెడీ టైమింగ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర ఖాయమనిపిస్తోంది.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఈ ఆదివారం రాత్రి నుంచే పెయిడ్ ప్రిమియర్స్ తో సందడి చేయనుంది. సోమవారం రోజున అఫీషియల్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులతో పాటు విక్టరీ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. మరి వెంకీ గౌడగా మన వెంకీ బాబు ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus