విక్టరీ వెంకటేష్ (Venkatesh) మొదటి నుండి ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి. ఈ విషయం చాలా మందికి తెలుసు. మొదటి అతనికి సినిమాలపై ఆసక్తి లేదు. విదేశాల్లో చదువుకుని అక్కడే సముద్రం ఒడ్డున ఒక ఇల్లు కొనుక్కుని ఫ్యామిలీతో హ్యాపీగా జీవించాలి అని ఆశపడేవారట. కొన్ని కారణాల వల్ల వెంకీ… తన తండ్రి నిర్మించిన సినిమాలో హీరోగా చేయాల్సి వచ్చింది. తర్వాత ఆయన సినిమాల్లో కొనసాగాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో రజినీకాంత్.. వెంకటేష్ ను కలిసి కొన్ని విలువైన పాఠాలు నేర్పారట.
రామానాయుడు (D. Ramanaidu) నిర్మాణంలో రజినీకాంత్ (Rajinikanth) చేస్తున్న ఓ సినిమా షూటింగ్ టైంలో రజనీ చెప్పిన మాటలు తనపై చాలా ప్రభావం చూపినట్టు వెంకీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘సినిమా రిలీజ్ టైంలో నీ పోస్టర్లు వేశారా? భారీ కటౌట్లు పెట్టారా? వంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకు. పోస్టర్‌లో నీ ముఖం సరిగ్గా కనిపిస్తుందా? లేదా? అని కూడా పట్టించుకోకు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే..! మంచి కథలు ఎంపిక చేసుకోవడం.. సినిమాలు మంచిగా చేయడం.
అవి చాలు నిన్ను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి’ అని రజనీకాంత్… వెంకటేష్ కి చెప్పారట. ఆయన చెప్పిన ఈ మాటలను వెంకీ సీరియస్ గా తీసుకున్నారట.అప్పటి నుండి ప్రమోషన్స్, పోస్టర్లు, కటౌట్లు వంటి వాటిని సీరియస్ గా తీసుకోవట్లేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు వెంకటేష్.అలాగే మంచి కథలు చేయడంపై దృష్టి పెట్టినట్టు కూడా వెంకీ చెప్పారు. బహుశా అవే తనని ఈరోజు ఆ రీతిగా నిలబెట్టి ఉండొచ్చు అని వెంకీ భావిస్తారట.