ఇటీవల రిలీజ్ అయిన ‘సింగిల్’ ట్రైలర్లో ‘శివయ్యా’ ‘మంచు కురిసిపోవడం’ వంటి డైలాగులు మా అధ్యక్షుడు మంచు విష్ణుని (Manchu Vishnu) అలాగే ‘కన్నప్ప’ (Kannappa) టీంని హర్ట్ చేసినట్లు టాక్ నడిచిన సంగతి తెలిసిందే. దీంతో విషయం తెలుసుకున్న.. ‘సింగిల్’ (#Single) టీం కూడా వెంటనే రియాక్ట్ అయ్యి సారీ చెప్పడం జరిగింది. ఆ వీడియో ద్వారా హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం అండీ..! ఏప్రిల్ 28న మా ‘సింగిల్’ ట్రైలర్ ని లాంచ్ చేశాం.
దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో ‘కన్నప్ప’ టీం వాళ్ళు.. ట్రైలర్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్ కు కొంచెం హర్ట్ అయ్యారని తెలిసింది. అది మాకు తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తున్నాం. ఆ డైలాగులు ఉద్దేశపూర్వకంగా పెట్టినవి కావు. కానీ అవి తప్పుగా కన్వే అవ్వడం వల్ల.. మేము ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేశాం. ఆ డైలాగులు సినిమాలో కూడా ఉండవు.
హర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేసినవి కావు. ఈ సినిమాలో ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే మీమ్స్, సినిమా రిఫరెన్సులు, బయట ఎక్కువగా జరిగేవి కూడా సినిమాల్లో వాడటం జరిగింది. అందులో భాగంగానే చిరంజీవి (Chiranjeevi) గారి డైలాగులు, బాలయ్య బాబు (Nandamuri Balakrishna) డైలాగులు, వెంకటేష్ బాబు (Venkatesh) గారి డైలాగులు.. ఇలా నిర్మాతలు అల్లు అరవింద్ (Allu Aravind) గారి వంటి అందరి డైలాగులు చాలా హెల్దీ కామెడీ కోసం వాడాము.
అలాంటివి కూడా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది కలిగించి ఉంటే వాళ్ళని అభిమానించే వారికి కూడా క్షమాపణలు చెబుతున్నాం. ఇండస్ట్రీలో ఉన్న మేమంతా కూడా ఒక ఫ్యామిలీ. కాబట్టి ఒకరిని మరొకరు తక్కువ చేసుకోవాలనే ఉద్దేశం లేదు. ఇది అర్థమయ్యేలా చెప్పడానికి కూడా ఈ వీడియో చేయడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చాడు.
సింహాచలం ఘటనపై జగన్ ఎమోషనల్ | 10TV#SreeVishnu #ManchuVishnu #SingleTrailer #Tollywood pic.twitter.com/rFep9uMCgY
— 10Tv News (@10TvTeluguNews) April 30, 2025