వెంకీ కొత్త డెసిషన్ .. కన్ఫ్యూజ్ చేస్తుందే…!

కేంద్ర ప్రభుత్వం షూటింగ్ లకు పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇచ్చేసినప్పటికీ పెద్ద హీరోలు మాత్రం షూటింగ్స్ కు రావడానికి సిద్దంగా లేరు. కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గని నేపధ్యంలో వాళ్లు షూటింగ్ లకు నో చెప్తున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో వెంకటేష్ కూడా ఇప్పట్లో షూటింగులకు రాను అని తేల్చి చెప్పేశారట.నిజానికి రానా పెళ్ళి అయ్యాక నారప్ప షూటింగ్ లో జాయినవుతాను అని మొదట ఆ చిత్రం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు చెప్పాడట.

కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే… ‘నారప్ప’ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ లో కాకుండా అవుట్ డోర్ లో జరిగింది. లాక్ డౌన్ వలన ఆగిపోయిన షూటింగ్ ను మొదలు పెట్టాలి అంటే మళ్లీ ఔట్ డోర్ వెళ్లాల్సిందే.ఇప్పుడు ఔట్ డోర్ వెళ్లి ‘నారప్ప’ షూటింగ్ మొదలుపెట్టడం అంటే చాలా రిస్క్ అని వెంకీ భావిస్తున్నాడట.ఈ ఏడాది చివరి వరకూ ‘నారప్ప’ షూటింగ్ మొదలు పెట్టేదే లేదని తేల్చి చెప్పేశాడట.

అయితే మరో పక్క ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ లో నటించడానికి రెడీ అని దర్శకుడు అనిల్ రావిపూడికి చెప్పాడట. 2021 సంక్రాంతి తర్వాత షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని వెంకీ… దర్శకుడు అనిల్ కి చెప్పాడట.అంతే ఇక ‘నారప్ప’ షూటింగ్ ఆగిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus