వైరలవుతున్న ‘వెంకీమామ’ లేటెస్ట్ పిక్!

  • August 4, 2019 / 07:24 AM IST

ఈ ఏడాది ఆరంభంలోనే ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రం నుండీ ఇటీవల చిన్న సర్ప్రైజింగ్ వీడియో అంటూ ఒకటి విడుదల చేశారు. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ను ఈ ఆగష్టు లోనే విడుదల చేయబోతున్నారు ఆ మేకింగ్ వీడియోలో ప్రకటించారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది.

ఇక ఈ మేకింగ్ వీడియోలో వెంకీ లుక్ తెగ వైరలవుతుంది. ‘ఆర్మీ గ్రీన్ బులెట్’ పై కూర్చొని మీసం మెలితిప్పుతున్న వెంకీ… పక్కా మాస్ లుక్ లో అదరగొట్టాడు. ‘పచ్చని పొలాల మధ్య వెంకటేష్ ని చూస్తుంటే కోనసీమ బులెట్ బాబులా ఉన్నాడంటూ’ ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ మరియు ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus