Venkatesh: హెయిర్‌ లుక్‌ కోసం వెంకీ అంత ఖర్చు పెడుతున్నారా!

ఫ్యామిలీ కథలకు, వినోదాల సినిమాలకు వెంకటేశ్‌ కేరాఫ్‌ అడ్రెస్‌. విక్టరీ వెంకటేశ్‌ అంటూ విజయాన్ని పేరులో కలుపుకున్న వెంకీ సినిమాల్లో వినోదంతోపాటు వైవిధ్యం కూడా ఉంటుంది. అన్నీ ఒకేలా కనిపించినా.. ప్రతి సినిమాలోనూ ఏదో తేడా చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వెంకీ హెయిర్‌ విషయంలోనూ మార్పులు గమనించొచ్చు. హీరోలు చిన్న చిన్న మార్పులు అయితే చేసేస్తారు కానీ, పెద్ మార్పులు మాత్రం విగ్‌తోనే అవుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అలా వెంకటేశ్‌ కూడా విగ్‌లు వాడుతుంటారట.

వెంకటేశ్‌ అంటే మనకు ఓ లుక్‌ కళ్ల ముందు కదలాడుతుంది. ఒత్తైన జుట్టు.. ఒకటి రెడు స్పైక్స్‌.. ఇలా ఓ లుక్‌ అలవాటు అయిపోయింది. అయితే సినిమాల్లో వైవిధ్యం తీసుకొస్తున్నప్పుడు ఆ లుక్‌ పనికి రాదు. దీంతో వాటి కోసం వెంకటేశ్‌ విగ్‌ వాడతారట. ఒక్కో సినిమాకి ఒక్కోలా విగ్‌ ఉండేలా చూసుకుంటారట. అంటే సినిమాలో పాత్రను బట్టి విగ్‌ ఎంపిక ఉంటుంది. దీని కోసం విదేశాల నుండి విగ్‌లు తెప్పిస్తారట. ఇలా వెంకీ విగ్‌ల గురించి అతని మేకప్‌ మ్యాన్‌ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి.

వెంకటేశ్‌ రీసెంట్‌ ప్రాజెక్ట్‌లు చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉన్న ‘రానా నాయుడు’లో వెంకీ వైట్‌ హెయిర్‌తో కనిపిస్తారు. చూడటానికి కాస్త డిఫరెంట్‌గా ఉన్న ఆ వైట్‌ హెయిర్‌ విగ్‌ను అమెరికా నుండి తెప్పించారట. దీని కోసం రూ. 75 వేలు ఖర్చు చేశారని సమాచారం. నేచురల్‌గా కనిపించాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే అని వెంకీ మేకప్‌ మ్యాన్ అంటున్నారు. అంతేకాదు ‘నారప్ప’ సినిమా కోసం కూడా వెంకీ ఓ విగ్‌ తెప్పించుకున్నారట.

‘నారప్ప’ సినిమాలో వెంకీ ఓ పాత్ర కోసం గ్రే కలర్‌ హెయిర్‌తో కనిపిస్తారు. ఆ విగ్‌ను కూడా విదేశాల నుండే తెప్పించారట. దాని కోసం రూ. 65 వేలు ఖర్చు అయ్యిందని సమాచారం. ఇలా సినిమాలో పాత్ర కోసం జుట్టును విగ్‌ రూపంలో తెచ్చుకుంటున్నారట వెంకీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అవి ఎంత నేచురల్‌గా ఉన్నాయో.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus