Venkatesh: వెంకటేష్ అల్లుడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవాల్సిందే..!

టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ లో తిరుగులేని హీరో నిల్చిన వ్యక్తి విక్టరీ వెంకటేష్. ఈయన సినిమాలు థియేటర్స్ లో విడుదలైతే ఒక పండగ వాతావరణం లాగ ఉంటుంది. పండగకి బంధువులు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో, అలా వెంకటేష్ సినిమా థియేటర్స్ కుటుంబ ప్రేక్షకులతో కళకళలాడిపోతుంటాయి. అందుకే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అత్యధిక రికార్డ్స్ ని నెలకొల్పిన హీరోగా వెంకటేష్ నిలిచాడు. వెండితెర మీదనే కాదు, నిజ జీవితం లో కూడా వెంకటేష్ ఎంతో పద్ధతి గా ఉండే వ్యక్తి. అంతే పద్దతిగా తన పిల్లల్ని కూడా పెంచాడు.

మొదటి కూతురు కి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించి పంపించాడు. ఇప్పుడు రెండవ కూతురు హవ్య వాహిని కి కూడా ఘనంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. మొన్ననే విజయవాడ లో హవ్య వాహిని నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకకి టాలీవుడ్ కి చెందిన టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే హవ్య వాహిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు ఆకాష్. ఇతను దేశం లోనే టాప్ 10 గైనకాలజిస్ట్ డాక్టర్స్ లో ఒకడు. ఈయన సంపాదనన నెలకు కోట్ల రూపాయిలలోనే ఉంటుంది అట. గత ఏడాది నుండి మంచి సంబంధాలు చూస్తూ మొత్తానికి ఈ రేంజ్ సంబంధం ని ఫిక్స్ చేసాడు (Venkatesh) వెంకటేష్.

ఇలాంటి తండ్రి అందరికీ ఉండాలి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. పెళ్లి ఎప్పుడు ఏమిటి అనే విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ నిశ్చితార్ధ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగ చైతన్య ఇలా ఇండస్ట్రీ లో ఉండే ప్రముఖులు మొత్తం హాజరయ్యారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus