సంక్రాంతికి ఎలాంటి సినిమా రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ క్యాష్ చేసుకుంటుంది అనేది అందరి నమ్మకం. అందువల్ల వల్ల చాలా వరకు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేస్తూ ఉంటాయి. అలా అని ఈ సీజన్లో ప్లాపులు లేవా అంటే? ఎందుకు లేవు.. బోలెడన్ని డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ‘అంజి’ (Anji) ‘దేవీపుత్రుడు’ (Devi Putrudu) ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (NTR: Kathanayakudu) ఇలా చాలా ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సైందవ్’ (Saindhav) కూడా డిజాస్టరే.
వెంకటేష్ కి (Venkatesh) సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చేది. ‘కలిసుందాం రా’ (Kalisundam Raa) ‘లక్ష్మీ’ (Lakshmi) ‘ఎఫ్ 2’ (F2 Movie) వంటి సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అలాంటిది ‘సైందవ్’ డిజాస్టర్ అవ్వడం అందరికీ పెద్ద షాకిచ్చింది. వాస్తవానికి సంక్రాంతికి సెట్ అవ్వని జోనర్ సినిమాలు రిలీజ్ అయితే వాటిని ప్రేక్షకులు పట్టించుకోరు. ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
‘సైందవ్’ కూడా ఆ కోవకు చెందిన సినిమానే..! పేరుకు వెంకటేష్ సినిమా అయినప్పటికీ.. అందుకో వెంకీ మార్క్ ఎలిమెంట్స్ ఉండవు. కంప్లీట్ గా మిస్ అయ్యాయి.’దేవీపుత్రుడు’ కూడా అంతే..! సో వెంకటేష్.. ఈసారి సంక్రాంతి పండుగకి తగ్గ సినిమాతో వస్తున్నాడు. టైటిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) .. పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడికి (Anil Ravipudi) ఒక్క ఫ్లాప్ కూడా లేదు. సో కచ్చితంగా సంక్రాంతి లెక్కని వెంకటేష్ బ్యాలెన్స్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.