బాబాయ్ ముందే.. రెచ్చిపోయిన రానా..!

తాజాగా రానా హోస్ట్ గా చేస్తున్న ‘నెం1 యారి’ సీజ‌న్‌ 2 కు రానా బాబాయ్ అయిన విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అతిథులుగా విచ్చేసారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘ఎఫ్2’ ప్రమోషన్స్లో భాగంగా వీరు ఈ షో కి హాజరవ్వడం విశేషం. వీరి ఎంట్రీతో ఈ షోలో ఉత్సాహం నెలకొంది. గేమ్‌లో భాగంగా ‘ట్రూత్ ఆర్ డేర్.. నిజం చెప్తారా.. ధైర్యం చేస్తారా… అంటూ రానా అడుగుతుండగా, వెంకీ.. అసలు ఈ షో లకి నేను ఇందుకే రాను ‘ఇది స్క్రీప్ట్‌లో భాగ‌మే క‌దా ..మళ్ళీ ఎందుకు ట్రూత్ ఆర్ డేర్ అని అడ‌గ‌డం’ అంటూ రానా పై ఫన్నీ సెటైర్లు వేసాడు.

ఇక వెంకీ ప‌క్క‌న ఉన్న వరుణ్ తేజ్ ను ‘ట్రూత్ ఆర్ డేర్’ లో భాగంగా రానా అడుగుతూ… ‘వ‌రుణ్‌ నువ్వు వ‌ర్జిన్‌నేనా’ అని అడగగా ప‌క్క‌నే ఉన్న వెంకీ షాక్ తో.. ‘ఏంట్రా ఇది..ఇలా అడుగుతున్నావ్’ అంటూ రానాని పై మరోసారి కౌంటర్ వేసాడు. మరోసారి వ‌రుణ్ తేజ్ ను.. ‘చేయ‌కూడ‌ని ప‌ని ఏదో చేస్తూ నీ గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు దొరికిపోయావ్ నిజ‌మేనా అని రానా అడుగగా… దీని వెంకీ త‌న‌ స్టైల్ లో లేచి వ‌రుణ్ తేజ్‌ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక ఇండ‌స్ట్రీలో సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో ఎవ‌రు అంటే వ‌రుణ్ తేజ్ ఠ‌క్కున నాగ‌ర్జున గారు అని చెప్పగా …వెంకీ… ‘బాబు.. బాబు… నేను సాఫ్ట్ అమ్మా అని కామెడీ పండించాడు. ఇక ఈ ప్రొమో చూస్తుంటే ఫన్ గ్యారంటీ అనిపిస్తుంది. వచ్చే ఆదివారం ప్ర‌సారం కాబోతోన్న ఈ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

                       

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus