Venky Kudumula: అది జ్వరమే కాదు.. ఆ నిరక్ష్యం ఖరీదు నిండు జీవితం: డైరెక్టర్‌ పోస్ట్‌

కరోనా / కొవిడ్‌ – 19… రెండేళ్ల క్రితం అందరినీ భయపెట్టిన ఈ పదం ఇప్పుడు సాధారణం అయిపోయింది. ఏదో మామూలు జ్వరం అనుకుని వదిలేస్తున్నారు జనాలు. దీని వల్ల ఎంత నష్టపోతున్నారు అనే విషయం చాలామందికి తెలియడం లేదు. తాజాగా ఈ విషయం గురించే ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. జ్వరం వస్తే తేలిగ్గా తీసుకోవద్దు… అలాంటి తప్పు అస్సలు చేయొద్దని అందులో రాసుకొచ్చారు వెంకీ కుడుముల.

తమ కుటుంబంలో జరిగింది ఎవరికీ జరగకూడదు అంఊట భావోద్వేగంతో ఓ పోస్ట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో ఏమైందా అంటూ ఆందోళన చెందారు. గత కొన్ని వారాలుగా తన కజిన్‌ తరచూ జ్వరంతో బాధపడుతున్నాడని, సాధారణ జ్వరమేనని అనుకుని వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స తీసుకోలేదని చెప్పారు. అయితే అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్‌కు దారి తీసిందని రాసుకొచ్చారు. బీబీ సిండ్రోమ్‌ అంటే మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయడం.

జ్వరం వచ్చినప్పుడు సరైన సమయంలో చికిత్స అంది ఉంటే… నయమయ్యేదని కానీ డాక్టర్‌ దగ్గరికి వెళ్లకుండా ఆలస్యం చేయడం వల్ల జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఆ ఘటన వల్ల తమ కుటుంబానికి తీరని దుఖాన్ని మిగిల్చిందని చెప్పారు. అందుకే కొవిడ్‌ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకోవద్దని కోరారు. శరీరం సరైన స్థితిలో త్వరగా జ్వరం బారిన పడతాం. ఈ లక్షణాలను దయచేసి నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. మనం తీసుకునే చిన్న చిన్న ఆరోగ్య జాగ్రత్తలే మన జీవితాల్ని కాపాడతాయని చెప్పారు.

‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు (Venky Kudumula) వెంకీ కుడముల. ‘భీష్మ’ తర్వాత చిరంజీవి – దానయ్య కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. అయితే ఆ సినిమా సెకండాఫ్‌ కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత నితిన్‌ – రష్మిక కాంబోలో ఓ సినిమా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా మొదలవుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ మారుతుంది అని అంటున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus