విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తోన్న తాజా చిత్రం ‘వెంకీమామ’. డిసెంబర్ 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. పాయల్ రాజ్ పుత్,రాశీ ఖన్నా వంటి క్రేజీ భామలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా.. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, పాటలు సినిమా పై అంచనాల్ని మరింత పెంచేశాయనే చెప్పాలి. దీంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది.
ఇక ‘వెంకీమామ’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 7.5 cr |
సీడెడ్ | 5.4 cr |
ఆంధ్ర | 13.75 cr(share) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.75 cr |
ఓవర్సీస్ | 2.8 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 32.2 cr (share) |
‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 33 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ ఏడాది వెంకటేష్ ‘ఎఫ్2’ చిత్రం 80 కోట్ల షేర్ ను రాబట్టగా.. నాగ చైతన్య ‘మజిలీ’ చిత్రం 35 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. కాబట్టి ‘వెంకీమామ’ చిత్రం ఈజీగానే 33 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.
అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!