అసురన్ రీమేక్ కు రంగం సిద్ధం, త్వరలోనే షూటింగ్ స్టార్ట్

ధనుష్ ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన తమిళ చిత్రం “అసురన్” అక్కడ కమర్షియల్ హిట్ గా మాత్రమే కాక క్లాసిక్ గాను నిలిచిపోయింది. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయాలనుకోవడమే పెద్ద సెన్సేషన్ అనుకుంటే.. ఆ రస్టిక్ మూవీకి డైరెక్టర్ గా మంచి సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అద్దాలను ఫైనల్ చేయడం ఇంకాస్త హల్ చల్ చేసిన విషయం. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల ఎలా హ్యాండిల్ చేయగలడా అని అందరూ ఆలోచిస్తుంటే.. వెంకటేష్ మాత్రం శ్రీకాంత్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడట.

చిన్నపాటి మార్పులు చెప్పి.. అవన్నీ కంప్లీట్ చేసుకుని వస్తే త్వరగా షూటింగ్ స్టార్ట్ చేద్దామని కంగారు పెడుతున్నాడు వెంకీ మామ. సురేష్ బాబు ప్రస్తుతం అబ్రాడ్ లో ఉన్నారు.. ఆయన తిరిగి రాగానే క్యాస్టింగ్ ను ఫైనల్ చేసి.. షూటింగ్ స్టార్ట్ చేస్తారట. అసురన్ తెలుగు వెర్షన్ ఎలా ఉండబోతోంది అనేది అందరికీ ఆసక్తికరమైన ప్రశ్నయే.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus