తన “చావు” గురించి వేణు ఏమన్నాడు!!!

ప్రముఖ కమీడీయన్ వేణు మాధవ్ పై విష ప్రచారం జరిగింది. ఆయన చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే దానిపై వేణు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటెర్వ్యు లో మాట్లాడుతూ…కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు…తాను చనిపోయినట్లు ఇటీవల జరిగిన ప్రచారం చాలా బాధించిందని వేణు మాధవ్ తెలిపారు. ఆ ప్రచారం జరిగినపుడు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేను ఎక్కడైనా బయట ఉంటే, ఆ సమయంలో నా ఫోన్ కలవకపోతే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంత ఆందోళన చెందుతారో ఒక్కసారి ఆలోచించండి.

కొందరైతే నాకు ఫోన్ చేసి మూడో రోజు, పదకొండో రోజు కర్మ ఎప్పుడు అంటూ అడిగారు. ఇలాంటి వార్తలు విన్నపుడు నా భార్య, మా అమ్మ ఒకటే ఏడుపు. ఇలాంటి విని నేను భరించ గలను. కానీ నా కుటుంబ సభ్యులు బాధ పడుతుంటే భరించలేను అంటూ తన మనసులోని మాట బయట పెట్టారు వేణు మాధవ్. అవకాశాలు తగ్గిన విషయంపై కూడా వేణు స్పందిస్తూ…ఒకరి దగ్గరకు వెళ్లి సినిమా అవకాశాలు అడుక్కునే అవసరం నాకు లేదు. నా జీవితంలో ఎప్పుడూ అవకాశాల కోసం ప్రయత్నించ లేదు. అవకాశాలే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి అని ఘాటుగా స్పందించారు.

ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాలో, బాలయ్య 100వ సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేస్తున్నాను. ఈ సినిమాలో మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి అని వేణు మాధవ్ తెలిపారు. మొత్తానికి వేణు గారు సేఫ్ గా, యాక్టివ్ గా ఉన్నారు…ఇకనైనా మీడియా కాస్త కళ్ళు తెరుచుకుని వార్తలు రాస్తే బెట్టర్ అని ఆయన అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus