Venu Swamy: జాతకాలు చెబుతూ భారీగా ఆస్తులు సంపాదించిన వేణు స్వామి !

ప్రముఖ జ్యోతిష్యులుగా అందరి జాతకాలను చెబుతూ పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు. ఈయన సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అనే భేదాలు లేకుండా అందరి జాతకాలను చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వేణు స్వామి చెప్పే జాతకాలు నిజం కాకపోవడంతో పలువురు ఈయనపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఇలా జాతకాలు చెబుతూ సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్నటువంటి వేణు స్వామి తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈయన ఆస్తులకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేణు స్వామి ఒకవైపు జాతకాలు చెబుతూనే మరోవైపు బిజినెస్లను కూడా చేస్తున్నారు అంటూ ఈ వార్త వైరల్ గా మారింది. ఈ విధంగా వేణు స్వామికి ఉన్నటువంటి ఆస్తుల విషయాలు అలాగే వ్యాపారాల గురించి స్వయంగా వేణు స్వామి తెలియచేయడం విశేషం.

నేను జాతకాలు చెప్పడం ద్వారా మాత్రమే డబ్బు సంపాదించలేదని తనకు వైన్ షాప్స్, పబ్ కూడా ఉన్నాయని ఈయన తెలిపారు. ఇక తన భార్య వీణా వాణి కూడా భారీగా సంపాదిస్తుందని ఈయన వెల్లడించారు. ఇలా పబ్, వైన్ షాప్ రేంజ్ రోవర్ మాత్రమే కాకుండా మరికొన్ని చోట్ల ఆస్తులు కూడా ఉన్నాయని ఈయన తెలిపారు.

జాతకం చెప్పేవాడి జాతకమే బాగుంటే జ్యోతిష్యం ఎందుకు చెబుతారు అనే వారికి ఇదే నా సమాధానం అంటూ ఈయన నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు గురించి అలాగే తన సంపాదన గురించి బయటపెట్టారు. ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వేణు స్వామి (Venu Swamy) కూడా భారీగానే ఆస్తులను కూడా పెట్టారు అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus