Venu Swamy: అక్కినేని హీరోలకు ఫ్లాపులు రావడానికి కారణమిదా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని కుటుంబాలు ఉన్నా అక్కినేని ఫ్యామిలీ ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. అక్కినేని హీరోలు అటు క్లాస్, ఇటు మాస్ సినిమాలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో అక్కినేని ఫ్యామిలీ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. వేణుస్వామి మాట్లాడుతూ జాతకాలు కలవకపోయినా పెళ్లి చేసుకుంటే విడాకులు వస్తాయని ఆయన తెలిపారు.

జాతకాలు కలవకపోతే పిల్లలు పుట్టక పోవడం, ఆర్థిక సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయని వేణుస్వామి కామెంట్లు చేశారు. చైతన్య సమంత విడిపోయారంటే వాళ్ల ఇబ్బందులు వాళ్లకు ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు. ఐశ్వర్య అభిషేక్ లలో ఐశ్వర్యకే ఫేమ్ ఎక్కువని వేణుస్వామి అన్నారు. సెలబ్రిటీ స్టేటస్ లో ఇద్దరు సమానంగా ఉన్నా ఒకరు తక్కువగా ఉన్నా కష్టమేనని ఆయన తెలిపారు. అఖిల్ జాతకం బాలేదని వేణుస్వామి (Venu Swamy) అన్నారు.

నాగ్ జోక్యం చేసుకుంటే అఖిల్ కెరీర్ బాగుంటుందని ఆయన వెల్లడించారు. నాగార్జున కుటుంబంలో వంశ దోషం ఉందని అందుకే ఆ కుటుంబంలో విడాకులు జరిగాయని వేణుస్వామి కామెంట్లు చేశారు. శ్రీజ జాతకంలో గురువు నీచంలో ఉన్నాడని ఆయన తెలిపారు. గురువు నీచాన్ని బట్టి ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటారో అంచనా వేయవచ్చని వేణుస్వామి వెల్లడించారు.

మొదటి పెళ్లి అంచనా వేయవచ్చని తర్వాత ఎవరిని చేసుకుంటారో అంచనా వేయలేమని వేణుస్వామి అన్నారు. పెళ్లిళ్లు అనేవి వ్యక్తిగతం అని ఆయన చెప్పుకొచ్చారు. నేను జాతకం చెప్పిన సమయంలో కామెడీ అనిపిస్తుందని కానీ జాతకం నిజమైన సమయంలో నేను చెప్పింది నిజమో కాదో అర్థమవుతుందని వేణుస్వామి వెల్లడించారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus