Venu Swamy: వేణు స్వామి వ్యాఖ్యలపై పైర్ అవుతున్న నాగార్జున ఫ్యాన్స్!

ప్రముఖ టాలీవుడ్ హీరో హీరోయిన్ల జాతకాల తో పాటుగా, రాజకీయ నాయకుల జాతకాలను చెప్తూ నిత్యం సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలిచే వ్యక్తి వేణు గోపాల స్వామి. ఇతను చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి. చీకట్లో బాణాలు వేస్తాడో?, లేదా నిజంగానే ఈయన చెప్పేవి జరుగుతున్నాయో తెలీదు కానీ, సమంత విడాకులు తీసుకుంటుంది అన్న విషయం, అలాగే ప్రభాస్ కి కొంతకాలం వరకు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తప్పవు, నిర్మాతలు అతని మీద భారీ బడ్జెట్స్ పెట్టొద్దు అని చెప్పడం,

అవి నిజంగానే జరగడం మన కళ్లారా చూసాము. అప్పటి నుండి ఆయనకి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి అటెన్షన్ దొరికింది. కొంతమంది స్టార్ హీరోయిన్స్ అయితే ఇతనిని నిజంగానే నమ్మి శాంతి పూజలు కూడా చేయించుకున్నారు. వారిలో నిధి అగర్వాల్ మరియు కీర్తి సురేష్ కూడా ఉన్నారు. అయితే రీసెంట్ గా ఈయన అక్కినేని అఖిల్ విషయం లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేసాడు.

అఖిల్ ఇన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లో ఉంటున్నా అతనికి సరైన హిట్ రాకపోవడానికి కారణం ఆయన జాతకమే. అతని జాతకం అసలు బాగాలేదు, నాగార్జున గారు ఇప్పటికైనా ఆలస్యం చెయ్యకుండా నా వద్దకి తీసుకొచ్చి అఖిల్ కి శాంతి పూజ చేయిస్తే మంచిది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు అఖిల్ జీవితాన్ని అమల నాశనం చేస్తుందని,

అతను ఎప్పుడైతే తన కెరీర్ విషయం లో అమల ని పక్కన పెట్టి నాగార్జున చెప్పినట్టు నడుచుకుంటే అఖిల్ కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తుందని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అమల గారి గురించి తప్పుగా మాట్లాడుతావా అంటూ వేణు (Venu Swamy) స్వామి ని బూతులు తిడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus