Venu Swamy: నేను పవన్ ఫ్యాన్.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • February 17, 2024 / 10:22 AM IST

టాలీవుడ్ సినీ ప్రముఖుల జాతకాలను వెల్లడించడం ద్వారా వేణుస్వామి తరచూ వార్తల్లో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా వేణుస్వామి కామెంట్లు చేయగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి నేను పాజిటివ్ గా చెప్పినా ఆయన అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారని వేణుస్వామి కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని పవన్ కళ్యాణ్ మంచి కోరుకునే వ్యక్తులలో నేను కూడా ఒకడినని వేణుస్వామి చెప్పుకొచ్చారు. నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని కోరుకుంటానని ఆయన కామెంట్లు చేశారు. పవన్ ముఖ్యమంత్రి కావాలని భావించే వ్యక్తులలో తాను కూడా ఒకడినని వేణుస్వామి అన్నారు. పవన్ కళ్యాణ్ కు కుటిల రాజకీయాలు తెలియవని వేణుస్వామి తెలిపారు.

పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్లను సైతం తాను తప్పుబట్టానని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ సినిమా చూస్తూ పేపర్లు చింపిన రోజులు ఉన్నాయని వేణుస్వామి వెల్లడించారు. పవన్ పర్సనల్ లైఫ్ లో కాంట్రవర్సీలు ఉన్నాయని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి వేణుస్వామి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల గురించి వెల్లడిస్తూ వేణుస్వామి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

వేణుస్వామి గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నా ఆ కామెంట్లను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో భవిష్యత్తులో జరగబోయే విషయాలను సైతం వేణుస్వామి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరి కొందరు సెలబ్రిటీ జోడీలు సైతం విడాకులు తీసుకుంటారని వేణుస్వామి (Venu Swamy) వెల్లడిస్తున్నారు. వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకునే సెలబ్రిటీల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus