Veteran Actor: సినీ పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా గుండెపోటుతో చాలామంది సెలబ్రిటీలు చనిపోయారు. చిత్రపరిశ్రమ మరో విలక్షణ నటుడిని కోల్పోయింది. గుండెపోటుతో ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ కన్నుమూశారు. తమిళ, మలయాళ భాషల్లో విలన్ పాత్రలు పోషించిన కజాన్ ఖాన్ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మరణించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎం బాదుషా తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా తెలియజేశారు. కజాన్ ఖాన్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సెంతమిజ్ పట్టు తో తమిళంలోకి అడుగుపెట్టిన కజాన్ ఖాన్.. సేతుపతి ఐ.పి.ఎస్, కట్టుమరక్కరన్, మాప్పిళ్ళై గౌండర్ లాంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఉల్లతై అల్లిత, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, ప్రియమానవాలే వంటి చిత్రాలలో విలన్ గా నటించారు. 2008లో విడుదలైన పట్టాయకెళప్పు భాషలో వచ్చిన చిత్రమే ఆయన చివరి సినిమా. కజాన్ ఖాన్ గంధర్వం, సి.ఐ.డి మూసా, ది కింగ్, వర్ణపకిట్టు, డ్రీమ్స్ వంటి సినిమాలతో మలయాళీలకు దగ్గరయ్యారు.

(Veteran Actor) కజాన్ ఖాన్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కజాన్ ఖాన్ మలయాళంతో పాటు.. తమిళ్, తెలుగు, కన్నడలో కూడా పలు సినిమాల్లో నటించాడు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి, శ్రీహరి లీడ్ రోల్ చేసిన భద్రాచలం వంటి సినిమాల్లో విలన్ గా నటించాడు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus